జోడుగూడితి రిద్దరు సొంపగు జాణలే మీరు
(॥పల్లవి॥)
జోడుగూడితి రిద్దరు సొంపగు జాణలే మీరు
తోడ నీళ్లాడరయ్య దొరకె మీకిపుడు
(॥॥)
చెలియగుబ్బలమీఁదిచెమట పన్నీరుకావు
కలకలమనునవ్వు కప్పురకాపు
మలసేటి వినయపుమాటలు వేదమంత్రాలు
వెలసె మజ్జనవేళ వింతలాయ మీకు
(॥॥)
కాంతమేనితావి యటకటిఁ చందనపుకాపు
పొంతఁ గడకుంటే చూపు పునుగుకాపు
సంతసపు సరసాలు జరిపేటిపూడిగాలు
యింతటా మజ్జనవేళ యితవాయ మీకు
(॥॥)
ఇయ్యలమేల్మంగ కాంతులెత్తే తిరుపండికాపు
గయ్యాళిమదరాగము కస్తూరికాపు
ఇయ్యెడ శ్రీవేంకటేశ యెనసితి రిద్దరును
వోయ్యనే మజ్జనవేళ వొరపాయ మీకు
(||pallavi||)
joḍugūḍidi riddaru sŏṁpagu jāṇale mīru
toḍa nīḽlāḍarayya dŏragĕ mīgibuḍu
(||||)
sĕliyagubbalamīm̐disĕmaḍa pannīrugāvu
kalagalamanunavvu kappuragābu
malaseḍi vinayabumāḍalu vedamaṁtrālu
vĕlasĕ majjanaveḽa viṁtalāya mīgu
(||||)
kāṁtamenidāvi yaḍagaḍim̐ saṁdanabugābu
pŏṁtam̐ gaḍaguṁṭe sūbu punugugābu
saṁtasabu sarasālu jaribeḍibūḍigālu
yiṁtaḍā majjanaveḽa yidavāya mīgu
(||||)
iyyalamelmaṁga kāṁtulĕtte tirubaṁḍigābu
gayyāḽimadarāgamu kastūrigābu
iyyĕḍa śhrīveṁkaḍeśha yĕnasidi riddarunu
voyyane majjanaveḽa vŏrabāya mīgu