Jnyaaanulaala yogulaala sagalaviraktulaala

జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల
Language

(॥పల్లవి॥)
జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల
నానావిధాల నివి నమ్మేరు సుండి

(॥జ్ఞాను॥)
అలరి యింతుల యధరామృతము లివియెల్ల
కాలకూటవిషముల కరణి సుండి
శీలముతో వీరల చెట్టలు వట్టుటలెల్లా
బాలనాగాలఁ దొడికి పట్టుట సుండి

(॥జ్ఞాను॥)
కాంతలు నవ్వుచునైనాఁ గన్నులఁ జూచిన చూపు
పంతమున నలుగుల పాఁతర సుండి
బంతుల నెదుటనున్న పడఁతుల చన్ను లివి
కంతల నొడ్డిన బడిగండ్లు సుండి

(॥జ్ఞాను॥)
జవ్వనపుఁ గామినుల సరసపు మాటలెల్లా
మవ్వమైనయట్టి చొక్కు మంత్రాలు సుండి
యివ్వలను శ్రీవేంకటేశ్వరుదాసుల కివి
చివ్వనఁ జెప్పినట్టు చేసేవి సుండి

(||pallavi||)
jñānulāla yogulāla sagalaviraktulāla
nānāvidhāla nivi nammeru suṁḍi

(||jñānu||)
alari yiṁtula yadharāmṛtamu liviyĕlla
kālagūḍaviṣhamula karaṇi suṁḍi
śhīlamudo vīrala sĕṭṭalu vaṭṭuḍalĕllā
bālanāgālam̐ dŏḍigi paṭṭuḍa suṁḍi

(||jñānu||)
kāṁtalu navvusunainām̐ gannulam̐ jūsina sūbu
paṁtamuna nalugula pām̐tara suṁḍi
baṁtula nĕduḍanunna paḍam̐tula sannu livi
kaṁtala nŏḍḍina baḍigaṁḍlu suṁḍi

(||jñānu||)
javvanabum̐ gāminula sarasabu māḍalĕllā
mavvamainayaṭṭi sŏkku maṁtrālu suṁḍi
yivvalanu śhrīveṁkaḍeśhvarudāsula kivi
sivvanam̐ jĕppinaṭṭu sesevi suṁḍi