Jeevunigi nidu buddhi seppavayyaa hari neevu

జీవునికి నిటు బుద్ధి చెప్పవయ్యా హరి నీవు
Language

(॥పల్లవి॥)
జీవునికి నిటు బుద్ధి చెప్పవయ్యా హరి నీవు
కావక పోరాదు మాకుఁ గల యంతర్యామివి

(॥జీవు॥)
పైపై నెదురుకట్లఁ బంచదార వుండఁగాను
చేపట్టి యడిగి తెచ్చి చేఁదు దిన్నట్లు
పూపలైన చేతిలోనే పుణ్యములు వుండఁగాను
పాపములు చవియంటాఁ బట్టబొయ్యీ జీవుఁడు

(॥జీవు॥)
యింటిలోనే నవరత్నా లెన్నియైనా నుండఁగాను
కంటగించి గాజుఁబూస గట్టుకొన్నట్లు
వెంటనే హరినామాలు వేయివేలై వుండఁగా
జంట నితరమంత్రాలు జపియించీ జీవుఁడు

(॥జీవు॥)
చేసుకొన్న యిల్లాలు చేరువనే వుండఁగాను
వేసరక వెలయాలి వెతకినట్లు
మేసుల శ్రీవేంకటేశ మీదాస్యమే వుండఁగా
వాసిఁ బరులఁ గొలువనే వడిఁ గోరీ జీవుఁడు

(||pallavi||)
jīvunigi niḍu buddhi sĕppavayyā hari nīvu
kāvaga porādu māgum̐ gala yaṁtaryāmivi

(||jīvu||)
paibai nĕdurugaṭlam̐ baṁchadāra vuṁḍam̐gānu
sebaṭṭi yaḍigi tĕchchi sem̐du dinnaṭlu
pūbalaina sedilone puṇyamulu vuṁḍam̐gānu
pābamulu saviyaṁṭām̐ baṭṭabŏyyī jīvum̐ḍu

(||jīvu||)
yiṁṭilone navaratnā lĕnniyainā nuṁḍam̐gānu
kaṁṭagiṁchi gājum̐būsa gaṭṭugŏnnaṭlu
vĕṁṭane harināmālu veyivelai vuṁḍam̐gā
jaṁṭa nidaramaṁtrālu jabiyiṁchī jīvum̐ḍu

(||jīvu||)
sesugŏnna yillālu seruvane vuṁḍam̐gānu
vesaraga vĕlayāli vĕdaginaṭlu
mesula śhrīveṁkaḍeśha mīdāsyame vuṁḍam̐gā
vāsim̐ barulam̐ gŏluvane vaḍim̐ gorī jīvum̐ḍu