జీవుఁడు ప్రకృతియును శ్రీపతియుఁ గలఁడని
(॥పల్లవి॥)
జీవుఁడు ప్రకృతియును శ్రీపతియుఁ గలఁడని
భావించుకొంటే నిహపరములు గలుగు
(॥జీవుఁడు॥)
నీటికడవలో చంద్రునీడ దిష్టాంత మయితే
తాటించి కర్మము దేహిఁ దగుల నేలా
సాటి ప్రతిబింబమైతే చైతన్యము రా నేల
మాటున నప్పటి నీ జన్మములు రా నేలా
(॥జీవుఁడు॥)
జగము కప్పచిప్పరజతభ్రాంతివలె నైతే
నిగమము లీ యర్థము నిలుపనేలా
పగటున నత్యముపనికిఁ దెచ్చుకొ నేల
అగణితమైన సృష్ట్యాదులు రా నేలా
(॥జీవుఁడు॥)
చినుమయపు బ్రహ్మము చిక్కించి మాయ గప్పితే
ననుపమ పరిశుద్ధ మనఁగ నేలా
యెనసి శ్రీవేంకటేశుఁ డితనినే శరణని
ఘనుఁడౌట గాక వట్టి కలఁక లేలా
(||pallavi||)
jīvum̐ḍu prakṛtiyunu śhrībadiyum̐ galam̐ḍani
bhāviṁchugŏṁṭe nihabaramulu galugu
(||jīvum̐ḍu||)
nīḍigaḍavalo saṁdrunīḍa diṣhṭāṁta mayide
tāḍiṁchi karmamu dehim̐ dagula nelā
sāḍi pradibiṁbamaide saidanyamu rā nela
māḍuna nappaḍi nī janmamulu rā nelā
(||jīvum̐ḍu||)
jagamu kappasipparajadabhrāṁtivalĕ naide
nigamamu lī yardhamu nilubanelā
pagaḍuna natyamubanigim̐ dĕchchugŏ nela
agaṇidamaina sṛṣhṭyādulu rā nelā
(||jīvum̐ḍu||)
sinumayabu brahmamu sikkiṁchi māya gappide
nanubama pariśhuddha manam̐ga nelā
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍidanine śharaṇani
ghanum̐ḍauḍa gāga vaṭṭi kalam̐ka lelā