జీవాత్ముని దీమముగాఁ జేసుక యిందరిఁ గూడుక
(॥పల్లవి॥)
జీవాత్ముని దీమముగాఁ జేసుక యిందరిఁ గూడుక
కావలి దిరిగెద రిందుకుఁ గర్త లిదెవ్వరొకో
(॥జీవా॥)
పంచేంద్రియము లిదెవ్వరు పంచభూతము లెవ్వరు
పంచప్రాణములనియెడు ప్రభువు లి దెవ్వరొకో
పంచమహపాతకములఁ బాట్లఁబడువా రెవ్వరు
పంచత్వంబునఁ బొండఁగ భారకు లెవ్వరొకో
(॥జీవా॥)
తప్పక తిరువేంకటపతిఁ దలఁచెడివా రది యెవ్వరు
వొప్పగు సౌఖ్యము వొడగవ యోగ్యు లి దెవ్వరొకో
వొప్పుల తప్పుల చేఁతల నొడఁబడ నొల్లక సకలముఁ
దప్పించుక పుణ్యులు గాఁదగు వా రెవ్వరొకో
(||pallavi||)
jīvātmuni dīmamugām̐ jesuga yiṁdarim̐ gūḍuga
kāvali dirigĕda riṁdugum̐ garda lidĕvvarŏgo
(||jīvā||)
paṁcheṁdriyamu lidĕvvaru paṁchabhūdamu lĕvvaru
paṁchaprāṇamulaniyĕḍu prabhuvu li dĕvvarŏgo
paṁchamahabādagamulam̐ bāṭlam̐baḍuvā rĕvvaru
paṁchatvaṁbunam̐ bŏṁḍam̐ga bhāragu lĕvvarŏgo
(||jīvā||)
tappaga tiruveṁkaḍabadim̐ dalam̐sĕḍivā radi yĕvvaru
vŏppagu saukhyamu vŏḍagava yogyu li dĕvvarŏgo
vŏppula tappula sem̐tala nŏḍam̐baḍa nŏllaga sagalamum̐
dappiṁchuga puṇyulu gām̐dagu vā rĕvvarŏgo