(॥పల్లవి॥)
జయమాయ నీకు నాపె సరసములూ
నయగారి ముడియము నారసింహా
(॥జయ మాయ॥)
మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి
కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది
ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ
నామాట విని యిట్టె నారసింహా
(॥జయ మాయ॥)
మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి
చన్ను లురమునఁ బెట్టి సత మైనది
చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె
న న్నడిగే దింకా నేమి నారసింహా
(॥జయ మాయ॥)
చేతుల నిన్ను నలమి చెక్కుఁ జెక్కుఁ గదియించి
నీతితో నీ మెడసొమ్మై నెలకొన్నది
యీతల శ్రీవెంకటాద్రి నెనసితి వాపెతోడ
నా తలఁపు లీడేరించి నారసింహా
(||pallavi||)
jayamāya nīgu nābĕ sarasamulū
nayagāri muḍiyamu nārasiṁhā
(||jaya māya||)
momu sūsi nīdoḍa muchchaḍa lāḍa valasi
komali nī tŏḍamīm̐dam̐ gūsunnadi
āmugŏni aṭṭĕ māḍa lāḍa vayya ābĕdoḍa
nāmāḍa vini yiṭṭĕ nārasiṁhā
(||jaya māya||)
mannana nī yalugala maṁku dĕlava valasi
sannu luramunam̐ bĕṭṭi sada mainadi
sĕnnum̐ḍa vābĕ sanavu sĕlliṁcha vayya yiṭṭĕ
na nnaḍige diṁkā nemi nārasiṁhā
(||jaya māya||)
sedula ninnu nalami sĕkkum̐ jĕkkum̐ gadiyiṁchi
nīdido nī mĕḍasŏmmai nĕlagŏnnadi
yīdala śhrīvĕṁkaḍādri nĕnasidi vābĕdoḍa
nā talam̐pu līḍeriṁchi nārasiṁhā