Javvanamu pamtabamdi sari mumgidigi vachche

జవ్వనము పంటపండి సరి ముంగిటికి వచ్చె
Language

(॥పల్లవి॥)
జవ్వనము పంటపండి సరి ముంగిటికి వచ్చె
యెవ్వరిమాటలు నేల యింతిఁ జేకొనవయ్యా

(॥జవ్వ॥)
తేటతెల్లమిగ నవ్వి తేనెగారేమాట లాడి
కాటుకకన్నులఁ జూచీ కాంత నిన్నును
వాఁటమాయ వలపులు వడ్డివారీ తమకము
యేఁటికి జోలిసేసేవు ఇంతిఁ జేకొనవయ్యా

(॥జవ్వ॥)
సరసము నీపైఁ జల్లి సన్న లిన్నియునుఁ జేసి
వరుసవంతులు వేఁడీ వనిత నిన్నును
సరవాయ కోరికలు చవులాయ వేడుకలు
యెరపు లింకానేల ఇంతిఁ జేకొనవయ్యా

(॥జవ్వ॥)
చెక్కు కొనగోళ్ల నొక్కి చేయివట్టి నినుఁ దీసి
గక్కనఁ గాఁగిలించెను కాంత నిన్నును
యిక్కువ శ్రీ వేంకటేశ యీకె నిన్నుఁ గూడి మెచ్చె
యిక్కడనే మేలుచేరె యింతిఁ జేకొనవయ్యా

(||pallavi||)
javvanamu paṁṭabaṁḍi sari muṁgiḍigi vachchĕ
yĕvvarimāḍalu nela yiṁtim̐ jegŏnavayyā

(||javva||)
teḍadĕllamiga navvi tenĕgāremāḍa lāḍi
kāḍugagannulam̐ jūsī kāṁta ninnunu
vām̐ṭamāya valabulu vaḍḍivārī tamagamu
yem̐ṭigi jolisesevu iṁtim̐ jegŏnavayyā

(||javva||)
sarasamu nībaim̐ jalli sanna linniyunum̐ jesi
varusavaṁtulu vem̐ḍī vanida ninnunu
saravāya korigalu savulāya veḍugalu
yĕrabu liṁkānela iṁtim̐ jegŏnavayyā

(||javva||)
sĕkku kŏnagoḽla nŏkki seyivaṭṭi ninum̐ dīsi
gakkanam̐ gām̐giliṁchĕnu kāṁta ninnunu
yikkuva śhrī veṁkaḍeśha yīgĕ ninnum̐ gūḍi mĕchchĕ
yikkaḍane meluserĕ yiṁtim̐ jegŏnavayyā