Javvanabudaana vimta salamemtige

జవ్వనపుదాన వింత చలమేఁటికే
Language

(॥పల్లవి॥)
జవ్వనపుదాన వింత చలమేఁటికే
చివ్వన వీడె మొసగి సేవ సేయవే

(॥॥)
మక్కువతో రమణుఁడు మంచిమాట లాడఁగానే
వెక్కసములాడి యేల వేగిరించేవే
పక్కన నందుకుఁగాను పైఁ జేయివేసితేను
మొక్కలానఁ గాతాళించి మో మేల వంచేవే

(॥॥)
నయమిచ్చి యాతఁడు నవ్వు నీతో నవ్వఁగాను
రయమున నీవెంత రవ్వసేసేవే
ప్రియమున నప్పటిని పెనఁగి పొందుసేయఁగ
నియమానఁ జలపట్టి నీవేల లోఁగేవే

(॥॥)
శ్రీ వేంకటేశ్వరుడు చేరి నిన్ను గూడఁగానే
కావరించి నీవేల కక్కసించేవే
చేవదేర మీఁద మీఁదజిమ్మి రేఁగ మన్నించఁగా
వే వేలు విధాల నెట్టు వెరగందేవే

(||pallavi||)
javvanabudāna viṁta salamem̐ṭige
sivvana vīḍĕ mŏsagi seva seyave

(||||)
makkuvado ramaṇum̐ḍu maṁchimāḍa lāḍam̐gāne
vĕkkasamulāḍi yela vegiriṁcheve
pakkana naṁdugum̐gānu paim̐ jeyivesidenu
mŏkkalānam̐ gādāḽiṁchi mo mela vaṁcheve

(||||)
nayamichchi yādam̐ḍu navvu nīdo navvam̐gānu
rayamuna nīvĕṁta ravvaseseve
priyamuna nappaḍini pĕnam̐gi pŏṁduseyam̐ga
niyamānam̐ jalabaṭṭi nīvela lom̐geve

(||||)
śhrī veṁkaḍeśhvaruḍu seri ninnu gūḍam̐gāne
kāvariṁchi nīvela kakkasiṁcheve
sevadera mīm̐da mīm̐dajimmi rem̐ga manniṁcham̐gā
ve velu vidhāla nĕṭṭu vĕragaṁdeve