Javvana mamdari kokkabariye kaadaa

జవ్వన మందరి కొక్కపరియే కాదా
Language

(॥పల్లవి॥)
జవ్వన మందరి కొక్కపరియే కాదా
ఇవ్వల నింతేసి చేసి యేల యేచేవే

(॥జవ్వ॥)
మదనునియమ్మువాఁడి మగువ నీచూపువాఁడి
వెదచల్లువలపులు వేఁడివేఁడి
మదిఁ దమకము నిండె మాటలనే పొద్దువోయ
యిదివో యీగతి నన్ను యేలయేఁచేవే

(॥జవ్వ॥)
చందురువెన్నెలజోలి సతి నీనవ్వున నాలి
సందడిఁ గోరికలెల్ల జాలిమాలి
కందువ చిత్తము రాఁగె కాఁకలు మేనున మూఁగె
ఇందులోనె నీవు నన్ను యేల యేఁచేవే

(॥జవ్వ॥)
పడి నమృతపుబావి వనిత నీమోవియీవి
జడియుఁగాఁగిటిపొందు జమళిఠీవి
కడ శ్రీవేంకటపతిఁ గనక కూడితి నేను-
నెడయ నింతటిమీఁద యేల యేఁచేవే

(||pallavi||)
javvana maṁdari kŏkkabariye kādā
ivvala niṁtesi sesi yela yeseve

(||javva||)
madanuniyammuvām̐ḍi maguva nīsūbuvām̐ḍi
vĕdasalluvalabulu vem̐ḍivem̐ḍi
madim̐ damagamu niṁḍĕ māḍalane pŏdduvoya
yidivo yīgadi nannu yelayem̐seve

(||javva||)
saṁduruvĕnnĕlajoli sadi nīnavvuna nāli
saṁdaḍim̐ gorigalĕlla jālimāli
kaṁduva sittamu rām̐gĕ kām̐kalu menuna mūm̐gĕ
iṁdulonĕ nīvu nannu yela yem̐seve

(||javva||)
paḍi namṛtabubāvi vanida nīmoviyīvi
jaḍiyum̐gām̐giḍibŏṁdu jamaḽiṭhīvi
kaḍa śhrīveṁkaḍabadim̐ ganaga kūḍidi nenu-
nĕḍaya niṁtaḍimīm̐da yela yem̐seve