Jattaaittamai yumdare sagiyalaala

జత్తా‌ఇత్తమై యుండరే సకియలాల
Language

(॥పల్లవి॥)
జత్తా‌ఇత్తమై యుండరే సకియలాల
చిత్తమురా నూడిగాలు సేయరే ఇందరును

(॥జత్తా॥)
కొలువున నున్నవాఁడు గొబ్బన లోనికి వచ్చె
జలకము వోయరె సతులాల
తేలుపుమణుఁగు లిచ్చి తిరుణామము వెట్టి
నిలుచుండఁగానే మీరు నివాళెత్తరే

(॥జత్తా॥)
అట్టె పీఁటపై నునిచి యడ్డెనపైఁ బళ్లెమిడి
వొట్టి వడ్డించరే బొనా లువిదలాల
గుట్టుతోఁ బట్టపుదేవిఁగూడాఁ బొత్తునఁ బెట్టి
గట్టిగా వాసననీరు గక్కన నందియ్యరే

(॥జత్తా॥)
వేవేగ బాగాలియ్యరే వెసఁ బానుపువేయరె
తావిపువ్వు లోసఁగరే తరుణులాల
కావించి యలమేలుమంగఁ బాదాలోత్తుమనరే
సేవలెల్లఁ జేయరే శ్రీవేంకటపతికి

(||pallavi||)
jattā‌ittamai yuṁḍare sagiyalāla
sittamurā nūḍigālu seyare iṁdarunu

(||jattā||)
kŏluvuna nunnavām̐ḍu gŏbbana lonigi vachchĕ
jalagamu voyarĕ sadulāla
telubumaṇum̐gu lichchi tiruṇāmamu vĕṭṭi
nilusuṁḍam̐gāne mīru nivāḽĕttare

(||jattā||)
aṭṭĕ pīm̐ṭabai nunisi yaḍḍĕnabaim̐ baḽlĕmiḍi
vŏṭṭi vaḍḍiṁchare bŏnā luvidalāla
guṭṭudom̐ baṭṭabudevim̐gūḍām̐ bŏttunam̐ bĕṭṭi
gaṭṭigā vāsananīru gakkana naṁdiyyare

(||jattā||)
vevega bāgāliyyare vĕsam̐ bānubuveyarĕ
tāvibuvvu losam̐gare taruṇulāla
kāviṁchi yalamelumaṁgam̐ bādālottumanare
sevalĕllam̐ jeyare śhrīveṁkaḍabadigi