Janulaala poojimcharo jayamti nemdu

జనులాల పూజించరో జయంతి నేఁడు
Language

(॥పల్లవి॥)
జనులాల పూజించరో జయంతి నేఁడు
వొనర నర్ఘ్యమీయరో వుదయించెఁ జంద్రుఁడు

(॥జను॥)
సవరేయి వుట్టినాఁడు శ్రావణబహుళాష్టమి
నవముగా రోహిణినక్షత్రమందు
దివిజులు వోగడఁగ దేవకిగర్భమునందు
భువిలో వసుదేవునిపుత్రుఁడై కృష్ణుఁడు

(॥జను॥)
తఱితో యమున దాటి తగఁ బెంచఁ బెట్టిరట
గుఱిగా యశోదనందగోపులయింట
మఱి జాతకర్మనామకరణాలు సేయరో
నెఱి నారగింపులెల్ల నించరో కృష్ణునికి

(॥జను॥)
చక్కిలాలు నురుగులు సరిఁ బళావళిగట్టి
మొక్కరో యీబాలునికి ముద్దుగారీని
తక్కకలమేల్‌మంగతోఁ దగ శ్రీవేంకటేశుఁడై
నిక్కిచూచీఁ గోలువురో నెమ్మదిఁ గృష్ణునిని

(||pallavi||)
janulāla pūjiṁcharo jayaṁti nem̐ḍu
vŏnara narghyamīyaro vudayiṁchĕm̐ jaṁdrum̐ḍu

(||janu||)
savareyi vuṭṭinām̐ḍu śhrāvaṇabahuḽāṣhṭami
navamugā rohiṇinakṣhatramaṁdu
divijulu vogaḍam̐ga devagigarbhamunaṁdu
bhuvilo vasudevunibutrum̐ḍai kṛṣhṇum̐ḍu

(||janu||)
taṟido yamuna dāḍi tagam̐ bĕṁcham̐ bĕṭṭiraḍa
guṟigā yaśhodanaṁdagobulayiṁṭa
maṟi jādagarmanāmagaraṇālu seyaro
nĕṟi nāragiṁpulĕlla niṁcharo kṛṣhṇunigi

(||janu||)
sakkilālu nurugulu sarim̐ baḽāvaḽigaṭṭi
mŏkkaro yībālunigi muddugārīni
takkagalamel‌maṁgadom̐ daga śhrīveṁkaḍeśhum̐ḍai
nikkisūsīm̐ goluvuro nĕmmadim̐ gṛṣhṇunini