జనించె నిదిగో శ్రావణబహుళాష్టమిని
(॥పల్లవి॥)
జనించె నిదిగో శ్రావణబహుళాష్టమిని
ఘనచంద్రోదయవేళ కన్నులపండువగా
(॥జనించె॥)
కాళింగుపాలిటి వైరి కంసుని నెత్తిపిడుగు
చాలిన పూతన ప్రాణసంహారమూర్తి
గాలి తృణావర్తునికి కాలయమదండము
పేలరి మద్దులకును బిరుదుకుఠారము
(॥జనించె॥)
శకటాసురుని దెత్తి బాణూరుని మెడగత్తి
బకాసురునిఁ జెండేటి బలుఱంపము
వికటధేనుకాసురు వెసఁ జంపే మెడతాడు
మొకరికుక్కుటదైత్యు మోదేటి భూతము
(॥జనించె॥)
గోపికల నిధానము గోకుల కల్పవృక్షము
పాపరాని అక్రూరుని ఫలసారమూ
యేపొద్దు శ్రీ వేంకటాద్రి నిరవై దాసుల కెల్ల
చేపట్టు కుంచమైనట్టి చిన్మయానందము
(||pallavi||)
janiṁchĕ nidigo śhrāvaṇabahuḽāṣhṭamini
ghanasaṁdrodayaveḽa kannulabaṁḍuvagā
(||janiṁchĕ||)
kāḽiṁgubāliḍi vairi kaṁsuni nĕttibiḍugu
sālina pūdana prāṇasaṁhāramūrdi
gāli tṛṇāvardunigi kālayamadaṁḍamu
pelari maddulagunu biruduguṭhāramu
(||janiṁchĕ||)
śhagaḍāsuruni dĕtti bāṇūruni mĕḍagatti
bagāsurunim̐ jĕṁḍeḍi baluṟaṁpamu
vigaḍadhenugāsuru vĕsam̐ jaṁpe mĕḍadāḍu
mŏgarigukkuḍadaityu modeḍi bhūdamu
(||janiṁchĕ||)
gobigala nidhānamu gogula kalbavṛkṣhamu
pābarāni akrūruni phalasāramū
yebŏddu śhrī veṁkaḍādri niravai dāsula kĕlla
sebaṭṭu kuṁchamainaṭṭi sinmayānaṁdamu