Jamkimchidanevu nannu saadavaa neevu

జంకించితనేవు నన్ను సాదవా నీవు
Language

(॥పల్లవి॥)
జంకించితనేవు నన్ను సాదవా నీవు
సంకించ వేమిటికి సాదవా నీవు

(॥॥)
దూరి కొపకత్తెనంటా తొయ్యలుల కందరికి
సారె సారెఁ జెప్పేవు సాదవా నీవు
వూరికే మాటలాడుతా నొద్దఁ గూచుండి నా కిట్టె
సారపుబుద్ది చెప్పేవు సాదవా నీవు

(॥॥)
గొరబుగా నావలపు కొల్లున నవ్వుతా నీవు
సరవితోఁ గేరేవు సాదవా నీవు
తెరవేసి యానవెట్టి దిమ్మరి సేఁతలు చేసి
సరుగఁ జెక్కునొక్కేవు సాదవా నీవు

(॥॥)
కలికినాకుచములు కాఁగిటను బిగియించి
చలపట్టి కూడితివి సాదవా నీవు
అలరి శ్రీ వేంకటేశ అదరపుతేనె లిచ్చి
చలివాసితివి సిగ్గు సాదవా నీవు

(||pallavi||)
jaṁkiṁchidanevu nannu sādavā nīvu
saṁkiṁcha vemiḍigi sādavā nīvu

(||||)
dūri kŏbagattĕnaṁṭā tŏyyalula kaṁdarigi
sārĕ sārĕm̐ jĕppevu sādavā nīvu
vūrige māḍalāḍudā nŏddam̐ gūsuṁḍi nā kiṭṭĕ
sārabubuddi sĕppevu sādavā nīvu

(||||)
gŏrabugā nāvalabu kŏlluna navvudā nīvu
saravidom̐ gerevu sādavā nīvu
tĕravesi yānavĕṭṭi dimmari sem̐talu sesi
sarugam̐ jĕkkunŏkkevu sādavā nīvu

(||||)
kaligināgusamulu kām̐giḍanu bigiyiṁchi
salabaṭṭi kūḍidivi sādavā nīvu
alari śhrī veṁkaḍeśha adarabudenĕ lichchi
salivāsidivi siggu sādavā nīvu