జమళిఁ గల్యాణము సరసుఁడాడె నేఁడు
(॥పల్లవి॥)
జమళిఁ గల్యాణము సరసుఁడాడె నేఁడు
చెమట లేఁటికి వచ్చెఁ జెప్పరే
(॥॥)
తూఁగు మంచముమీఁదఁ దొయ్యలు లిద్దరిఁ
గాఁగిలించుకొంటాఁ గరఁగీని
యేఁగుబెండ్లికొడు కెవ్వరిపై మోహము
చేఁగదేర నిది సరిఁ జెప్పలే
(॥॥)
ఇదె పెండ్లి పీఁట యిద్దరి కొకమాఁటే
కదసి పచ్చడము గప్పీని
యెదుగ దోసిట నించి యెవ్వరిపైఁ దలఁబాలు
చెదరకుండాఁ బోసెఁ జెప్పరే
(॥॥)
పొలఁతులిద్దరితోడ బువ్వానఁ గూచుండి
చలివాయఁ గళ్ళిచ్చీ సరిగాను
యెలమి శ్రీ వేంకటేశుఁ డెనసె నీవేళ నే-
చెలులకుఁ జనవిచ్చెఁ జెప్పరే
(||pallavi||)
jamaḽim̐ galyāṇamu sarasum̐ḍāḍĕ nem̐ḍu
sĕmaḍa lem̐ṭigi vachchĕm̐ jĕppare
(||||)
tūm̐gu maṁchamumīm̐dam̐ dŏyyalu liddarim̐
gām̐giliṁchugŏṁṭām̐ garam̐gīni
yem̐gubĕṁḍligŏḍu kĕvvaribai mohamu
sem̐gadera nidi sarim̐ jĕppale
(||||)
idĕ pĕṁḍli pīm̐ṭa yiddari kŏgamām̐ṭe
kadasi pachchaḍamu gappīni
yĕduga dosiḍa niṁchi yĕvvaribaim̐ dalam̐bālu
sĕdaraguṁḍām̐ bosĕm̐ jĕppare
(||||)
pŏlam̐tuliddaridoḍa buvvānam̐ gūsuṁḍi
salivāyam̐ gaḽḽichchī sarigānu
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍĕnasĕ nīveḽa ne-
sĕlulagum̐ janavichchĕm̐ jĕppare