(॥పల్లవి॥)
జమళి వలపులివి సరి దాఁకె
సముకంబుననే చందములాయ
(॥॥)
యింతితో నేకాంత మేమాడితివో
చెంతల చెమటలు చిందీని
వింతగ నీవాపె విన్నపంబులకు
కాంతుఁడ పులకలఁ గడు మించితివి
(॥॥)
జలజాక్షికి నేసన్న చేసితివొ
సెలవుల నగవులు జిగి మించె
పొలయుచు నీవాకె బొమ్మజంకెనల
వెలయఁగ గడు నివ్వెరగందితివి
(॥॥)
యీవనితను నీవెపుడు గలసితివొ
లావుగ మోముకళలు నిండె
వోవరి నాపె నీవుర మెక్కఁగా
శ్రీవేంకటేశ్వర సిరులందితివి
(||pallavi||)
jamaḽi valabulivi sari dām̐kĕ
samugaṁbunane saṁdamulāya
(||||)
yiṁtido negāṁta memāḍidivo
sĕṁtala sĕmaḍalu siṁdīni
viṁtaga nīvābĕ vinnabaṁbulagu
kāṁtum̐ḍa pulagalam̐ gaḍu miṁchidivi
(||||)
jalajākṣhigi nesanna sesidivŏ
sĕlavula nagavulu jigi miṁchĕ
pŏlayusu nīvāgĕ bŏmmajaṁkĕnala
vĕlayam̐ga gaḍu nivvĕragaṁdidivi
(||||)
yīvanidanu nīvĕbuḍu galasidivŏ
lāvuga momugaḽalu niṁḍĕ
vovari nābĕ nīvura mĕkkam̐gā
śhrīveṁkaḍeśhvara sirulaṁdidivi