జగన్నాథా నీ కొక్కనికి శరణు చొచ్చితిమి కావఁ గదే
(॥పల్లవి॥)
జగన్నాథా నీ కొక్కనికి శరణు చొచ్చితిమి కావఁ గదే
అగపడి మాలో నున్నాఁడ వనుచు నానతి యిచ్చెను మా గురుఁడు
(॥జగ॥)
కలదు వొకానొక యదృష్ట మందురు కనుఁగొనలే రెవ్వరును
తొలుత జనించిన జన్మము లెంతురు తెలియ నశక్యములు
యెలమిని స్వర్గము గలదట ముందర కెక్కడ నున్నదొ మిన్నులపై
వెలుపల నిట్టి విశేషంబులు నే వెతకఁగ నా తరమా
(॥జగ॥)
పొదుగుకొన్న దిదే కర్మమె యందురు పొడచూపుటలే దెక్కడను
యెదిటిది మాయాకల్పితమే యట యెట్లు గురుతుపడు మాకును
కదిసి చరాచరములకు నెప్పుడును కాచుకొన్నది విధియని చెప్పేరు
విదితములై నవి యెక్కడెక్క డని వెతకఁగ నా తరమా
(॥జగ॥)
అనుభవించువాఁ డాత్ముఁడే యందురు అణురూపం బనితలఁచఁగరాదు
తనువు సాధనము సర్వంబున కట తగు లిదె కంటిమి దృష్టముగా
ననయంబును శ్రీవేంకటేశ్వరా యలమేల్మంగ విభుఁడా
నిన్నుఁ గొలిచితి నిన్నిటికీ నెలవుగా నీ మహి మెఱుఁగఁగ నాతరమా
(||pallavi||)
jagannāthā nī kŏkkanigi śharaṇu sŏchchidimi kāvam̐ gade
agabaḍi mālo nunnām̐ḍa vanusu nānadi yichchĕnu mā gurum̐ḍu
(||jaga||)
kaladu vŏgānŏga yadṛṣhṭa maṁduru kanum̐gŏnale rĕvvarunu
tŏluda janiṁchina janmamu lĕṁturu tĕliya naśhakyamulu
yĕlamini svargamu galadaḍa muṁdara kĕkkaḍa nunnadŏ minnulabai
vĕlubala niṭṭi viśheṣhaṁbulu ne vĕdagam̐ga nā taramā
(||jaga||)
pŏdugugŏnna dide karmamĕ yaṁduru pŏḍasūbuḍale dĕkkaḍanu
yĕdiḍidi māyāgalbidame yaḍa yĕṭlu gurudubaḍu māgunu
kadisi sarāsaramulagu nĕppuḍunu kāsugŏnnadi vidhiyani sĕpperu
vididamulai navi yĕkkaḍĕkka ḍani vĕdagam̐ga nā taramā
(||jaga||)
anubhaviṁchuvām̐ ḍātmum̐ḍe yaṁduru aṇurūbaṁ banidalam̐sam̐garādu
tanuvu sādhanamu sarvaṁbuna kaḍa tagu lidĕ kaṁṭimi dṛṣhṭamugā
nanayaṁbunu śhrīveṁkaḍeśhvarā yalamelmaṁga vibhum̐ḍā
ninnum̐ gŏlisidi ninniḍigī nĕlavugā nī mahi mĕṟum̐gam̐ga nādaramā