Jagamellaam joosidini sanavarulai yunnaaru

జగమెల్లాఁ జూచితిని చనవరులై యున్నారు
Language

(॥పల్లవి॥)
జగమెల్లాఁ జూచితిని చనవరులై యున్నారు
అగపడి యెవ్వరిఁ గాదనవచ్చును మాకును

(॥జగ॥)
అందరి భ్రమయించేది అదిగో నీ విష్ణుమాయ
పొందుగా సృష్టి యెల్లా నీ పుత్రుఁడైన బ్రహ్మదే
యెందును సంసారము సేయించేవాఁడు మన్మథుఁడు
చెంది యెవ్వరిఁ గా దని చెప్పవచ్చు మాకును

(॥జగ॥)
సర్వము నీ యాజ్జ యని సంకల్పము చెప్పేరు
వుర్వి నెత్తిఁ బెట్టుకొని వున్నాఁడు నీ శేషుఁడు
పర్వి నీ మహిమ విష్ణుపాద మట ఆకాశము
నిర్వహించి యెవ్వరితో నెట్టు కొనే మిఁకను

(॥జగ॥)
జలధి పాన్పు రవిచంద్రులు కన్నులు
నెలవు బ్రహ్మాండము నీ కింతా నటే
యెలమి శ్రీవేంకటేశ యలమేల్మంగపతిని
తలఁప నెవ్వరు నీ చిత్తము పట్టి రిఁకను

(||pallavi||)
jagamĕllām̐ jūsidini sanavarulai yunnāru
agabaḍi yĕvvarim̐ gādanavachchunu māgunu

(||jaga||)
aṁdari bhramayiṁchedi adigo nī viṣhṇumāya
pŏṁdugā sṛṣhṭi yĕllā nī putrum̐ḍaina brahmade
yĕṁdunu saṁsāramu seyiṁchevām̐ḍu manmathum̐ḍu
sĕṁdi yĕvvarim̐ gā dani sĕppavachchu māgunu

(||jaga||)
sarvamu nī yājja yani saṁkalbamu sĕpperu
vurvi nĕttim̐ bĕṭṭugŏni vunnām̐ḍu nī śheṣhum̐ḍu
parvi nī mahima viṣhṇubāda maḍa āgāśhamu
nirvahiṁchi yĕvvarido nĕṭṭu kŏne mim̐kanu

(||jaga||)
jaladhi pānpu ravisaṁdrulu kannulu
nĕlavu brahmāṁḍamu nī kiṁtā naḍe
yĕlami śhrīveṁkaḍeśha yalamelmaṁgabadini
talam̐pa nĕvvaru nī sittamu paṭṭi rim̐kanu