(॥పల్లవి॥)
జగడపుఁ జనవుల జాజర
సగినల మంచపు జాజర
(॥జగ॥)
మొల్లలు దురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లనఁ బుప్పొడి జారఁగఁ బతిపై
చల్లేరతివలు జాజర
(॥జగ॥)
భారపుఁ గుచముల పైపైఁ గడు సిం-
గారము నెరుపేటి గందవొడి
చేరువ పతిపై చిందఁగఁ బడఁతులు
సారెకుఁ జల్లేరు జాజర
(॥జగ॥)
బింకపుఁ గూటిమి పెనఁగేటి చెమటల-
పంకపుఁ బూఁతల పరిమళము
వేంకటపతిపై వెలఁదులు నించేరు
సంకుమదంబుల జాజర
(||pallavi||)
jagaḍabum̐ janavula jājara
saginala maṁchabu jājara
(||jaga||)
mŏllalu durumula muḍisina baruvuna
mŏllabu sarasabu muribĕmuna
jallanam̐ buppŏḍi jāram̐gam̐ badibai
salleradivalu jājara
(||jaga||)
bhārabum̐ gusamula paibaim̐ gaḍu siṁ-
gāramu nĕrubeḍi gaṁdavŏḍi
seruva padibai siṁdam̐gam̐ baḍam̐tulu
sārĕgum̐ jalleru jājara
(||jaga||)
biṁkabum̐ gūḍimi pĕnam̐geḍi sĕmaḍala-
paṁkabum̐ būm̐tala parimaḽamu
veṁkaḍabadibai vĕlam̐dulu niṁcheru
saṁkumadaṁbula jājara