జడిసేవు గనక నీ సమరతి నుండి నేను
(॥పల్లవి॥)
జడిసేవు గనక నీ సమరతి నుండి నేను
వొడివట్టుకున్నదాన నొద్దికలు మీరఁగా
(॥॥)
వలపులు రేఁచితే వడిగొనీఁ దమకము
తలఁచుకొంటేఁ గడుఁ దమి యెక్కీని
మొలకచన్నులురము మోవ నిన్నుఁ గాఁగిలించి
బలిమి నుందాన నిదే పట్టరాక పాయము
(॥॥)
తప్పక చూచితేను తడఁబడీఁ జిత్తము
ముప్పిరిగా నవ్వితేను ముంచీ వేడుక
నెప్పుగాఁగా నామోవి నీమోవి గదియించి
చిప్పిలి వుందాన నిట్టే చెలరేఁగీఁ దనువు
(॥॥)
నెఱి సరస మాడితే నిండుకొనీఁ బులకలు
చెఱఁగు గప్పెతే నట్టే చెమరించీని
యెఱిగి శ్రీవేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
వొఱగుకుందాన నీపై నొనరె నానోములు
(||pallavi||)
jaḍisevu ganaga nī samaradi nuṁḍi nenu
vŏḍivaṭṭugunnadāna nŏddigalu mīram̐gā
(||||)
valabulu rem̐side vaḍigŏnīm̐ damagamu
talam̐sugŏṁṭem̐ gaḍum̐ dami yĕkkīni
mŏlagasannuluramu mova ninnum̐ gām̐giliṁchi
balimi nuṁdāna nide paṭṭarāga pāyamu
(||||)
tappaga sūsidenu taḍam̐baḍīm̐ jittamu
muppirigā navvidenu muṁchī veḍuga
nĕppugām̐gā nāmovi nīmovi gadiyiṁchi
sippili vuṁdāna niṭṭe sĕlarem̐gīm̐ danuvu
(||||)
nĕṟi sarasa māḍide niṁḍugŏnīm̐ bulagalu
sĕṟam̐gu gappĕde naṭṭe sĕmariṁchīni
yĕṟigi śhrīveṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
vŏṟaguguṁdāna nībai nŏnarĕ nānomulu