జపములుఁ దపములు సంధ్యాదివిధులకు
(॥పల్లవి॥)
జపములుఁ దపములు సంధ్యాదివిధులకు
నెపము నామీఁద నింతే నీకే సెలవు
(॥జప॥)
ఫలము నినుఁ గోరని పంతమువాఁడాఁ గాను
వలెననడుగ నెంతవాఁడను నేను
చెలఁగి నీవు కర్మము సేయించఁగాఁ జేసేటి-
వెలలేక తెచ్చుకొన్న వెట్టివాఁడ నేను
(॥జప॥)
ఆస మానితిననేటి యహంకారి నేఁ గాను
వాసికి నీతోఁ బెనఁగేవాఁడనా నేను
వేసరకుండాఁ గట్లు విడిపించి యేలుకోఁగా
దాసుఁడనై బదికేటి ధర్మపువాఁడ నేను
(॥జప॥)
జ్ఞానినైతిననే గర్వాచారపువాఁడాఁ గాను
కానక నీపై మోపుగట్ట నోపను
ఆనుక శ్రీవేంకటేశ ఆతుమ నీవుండఁగాను
మోనాన నీకు మొక్కేటి మునివాఁడ నేను
(||pallavi||)
jabamulum̐ dabamulu saṁdhyādividhulagu
nĕbamu nāmīm̐da niṁte nīge sĕlavu
(||jaba||)
phalamu ninum̐ gorani paṁtamuvām̐ḍām̐ gānu
valĕnanaḍuga nĕṁtavām̐ḍanu nenu
sĕlam̐gi nīvu karmamu seyiṁcham̐gām̐ jeseḍi-
vĕlalega tĕchchugŏnna vĕṭṭivām̐ḍa nenu
(||jaba||)
āsa mānidinaneḍi yahaṁkāri nem̐ gānu
vāsigi nīdom̐ bĕnam̐gevām̐ḍanā nenu
vesaraguṁḍām̐ gaṭlu viḍibiṁchi yelugom̐gā
dāsum̐ḍanai badigeḍi dharmabuvām̐ḍa nenu
(||jaba||)
jñāninaidinane garvāsārabuvām̐ḍām̐ gānu
kānaga nībai mobugaṭṭa nobanu
ānuga śhrīveṁkaḍeśha āduma nīvuṁḍam̐gānu
monāna nīgu mŏkkeḍi munivām̐ḍa nenu