జాఱెఁ గొప్పు యింకా నేల జంపుమాటలు
(॥పల్లవి॥)
జాఱెఁ గొప్పు యింకా నేల జంపుమాటలు - నే
నాఱడైతి నీకుఁగానే ఆరేఁ దేరేఁ బడరోరి
(॥జాఱె॥)
ఆడరాదు దొరవని ఆడకున్నఁ బోదు నిన్ను
చూడఁ జూడ నీ మో వేల చుక్క లాయెరా
తోడనే గోరితి వెంట తొడుకు లైనట్లా యని
జాడలెల్లఁ గంటి వింటిఁ జాలుఁ జాలుఁ బదరోరి
(॥జాఱె॥)
మొదల నే నెఱుఁగక మోసపోతి గాక నేఁ
గదిసి యేపొద్దు వద్దఁ గాచుకుండనా
యిదె మింగినకడికి నిఁకఁ జవు లెంచ నేల
చెదరని పంతమెల్లాఁ జెల్లెఁ జెల్లెఁ బదరోరి
(॥జాఱె॥)
సిగ్గు లెల్లాఁ దీరె దీరె శ్రీవేంకటేశుఁడ నేను
వెగ్గళమై నీ నా సంది వింత లేలరా
దగ్గరి కూడిన మీఁద తలపోఁత లిఁక నేల
యగ్గలమై నీనా కోప మారెఁ దీరెఁ బదరోరి
(||pallavi||)
jāṟĕm̐ gŏppu yiṁkā nela jaṁpumāḍalu - ne
nāṟaḍaidi nīgum̐gāne ārem̐ derem̐ baḍarori
(||jāṟĕ||)
āḍarādu dŏravani āḍagunnam̐ bodu ninnu
sūḍam̐ jūḍa nī mo vela sukka lāyĕrā
toḍane goridi vĕṁṭa tŏḍugu lainaṭlā yani
jāḍalĕllam̐ gaṁṭi viṁṭim̐ jālum̐ jālum̐ badarori
(||jāṟĕ||)
mŏdala ne nĕṟum̐gaga mosabodi gāga nem̐
gadisi yebŏddu vaddam̐ gāsuguṁḍanā
yidĕ miṁginagaḍigi nim̐kam̐ javu lĕṁcha nela
sĕdarani paṁtamĕllām̐ jĕllĕm̐ jĕllĕm̐ badarori
(||jāṟĕ||)
siggu lĕllām̐ dīrĕ dīrĕ śhrīveṁkaḍeśhum̐ḍa nenu
vĕggaḽamai nī nā saṁdi viṁta lelarā
daggari kūḍina mīm̐da talabom̐ta lim̐ka nela
yaggalamai nīnā koba mārĕm̐ dīrĕm̐ badarori