Jaanamdavu neegu nide saddivalabu

జాణఁడవు నీకు నిదే చద్దివలపు
Language

(॥పల్లవి॥)
జాణఁడవు నీకు నిదే చద్దివలపు
రాణించె నింకెన్నఁడు నీ రపమాయ వలపు

(॥జాణ॥)
చెక్కు నొక్కి తనివోక చెలి నీపై మోహాన
మొక్కులు మొక్కీనూరకే మోము చూచీని
చిక్కని నవ్వులు నవ్వి చిదిమినా నెఱఁగదు
వెక్కసములాయఁ బట్టు వేఁడి వేఁడి వలపు

(॥జాణ॥)
మమత నీపైఁ బెంచి మనసు పట్టఁగ లేక
భ్రమసి నీలోఁచి(?) లోలో బయలీఁదీవి
కొమెరమదానఁ జొక్కి కోపంచినా నెఱఁగదు
తమితోడఁ బట్టుమీ పదను వచ్చేవలపు

(॥జాణ॥)
పవళించి సన్నచేసి భావము నిలుపలేక
చెవిలోన మాటచెప్పి చెమరించీని
తివిరి శ్రీ వేంకటేశ తెరవేసి నిన్నుఁ గూడె
నవకానఁ బట్టుమీ కొన్నదికోలు వలపు

(||pallavi||)
jāṇam̐ḍavu nīgu nide saddivalabu
rāṇiṁchĕ niṁkĕnnam̐ḍu nī rabamāya valabu

(||jāṇa||)
sĕkku nŏkki tanivoga sĕli nībai mohāna
mŏkkulu mŏkkīnūrage momu sūsīni
sikkani navvulu navvi sidiminā nĕṟam̐gadu
vĕkkasamulāyam̐ baṭṭu vem̐ḍi vem̐ḍi valabu

(||jāṇa||)
mamada nībaim̐ bĕṁchi manasu paṭṭam̐ga lega
bhramasi nīlom̐si(?) lolo bayalīm̐dīvi
kŏmĕramadānam̐ jŏkki kobaṁchinā nĕṟam̐gadu
tamidoḍam̐ baṭṭumī padanu vachchevalabu

(||jāṇa||)
pavaḽiṁchi sannasesi bhāvamu nilubalega
sĕvilona māḍasĕppi sĕmariṁchīni
tiviri śhrī veṁkaḍeśha tĕravesi ninnum̐ gūḍĕ
navagānam̐ baṭṭumī kŏnnadigolu valabu