జాణతనమెంచవద్దా సతుల యడాటాన
(॥పల్లవి॥)
జాణతనమెంచవద్దా సతుల యడాటాన
వీణె వాయించినదాఁకా వేగిరమా
(॥జాణ॥)
మొగముచూడఁగానే మొక్కులు మొక్కేయాపెను
అగడుసేసి పెనఁగి యలయింతురా
తగలి యదియుఁగాక తమకించి యంతలోనే
బిగువుకుచము లిట్టె పిసుకుదురా
(॥జాణ॥)
సిగ్గుతోడ విన్నపాలు నేటియాపెను
బగ్గనను గోరగీరి పచ్చిసేతురా
నిగ్గున నంతటఁబోకనీయుతులెల్లా మెరసి
వెగ్గళించి పోఁకముడి వీడఁజేతురా
(॥జాణ॥)
గుట్టుతోడ వీడెమిచ్చి కూడేటియాపెను
ఱట్టువేసి నేర్పు రచ్చనట్టె వేతురా
ఇట్టె శ్రీవేంకటేశ యీయలమేలుమంగను
గట్టిగానేలి వింత కందునఁ జొక్కింతురా
(||pallavi||)
jāṇadanamĕṁchavaddā sadula yaḍāḍāna
vīṇĕ vāyiṁchinadām̐kā vegiramā
(||jāṇa||)
mŏgamusūḍam̐gāne mŏkkulu mŏkkeyābĕnu
agaḍusesi pĕnam̐gi yalayiṁturā
tagali yadiyum̐gāga tamagiṁchi yaṁtalone
biguvugusamu liṭṭĕ pisugudurā
(||jāṇa||)
siggudoḍa vinnabālu neḍiyābĕnu
baggananu goragīri pachchisedurā
nigguna naṁtaḍam̐boganīyudulĕllā mĕrasi
vĕggaḽiṁchi pom̐kamuḍi vīḍam̐jedurā
(||jāṇa||)
guṭṭudoḍa vīḍĕmichchi kūḍeḍiyābĕnu
ṟaṭṭuvesi nerbu rachchanaṭṭĕ vedurā
iṭṭĕ śhrīveṁkaḍeśha yīyalamelumaṁganu
gaṭṭigāneli viṁta kaṁdunam̐ jŏkkiṁturā