జాణ వలపుల తెంకి జవాదివంకి
(॥పల్లవి॥)
జాణ వలపుల తెంకి జవాదివంకి
నాణెమైన పతితోడ నవ్వు నవ్వఁగదవే
(॥జాణ॥)
కాటుక కనుచూపుల కలికీ
గాఁటపు మాఁటల చిలుకలు కొలికీ
చాటువ కెక్కిన యట్టి జాజి ములికీ
పాటించి నీ విభునికి బాగా లియ్యఁగదవే
(॥జాణ॥)
నెలకొన్న నవ్వుల వెన్నెలతేట
కులుకుఁ గుత్తికలోని కొవిలపాట
వెలయఁ జిత్తజకేళి వేడుక కోట
తలకొని నీమగనిపాదమ లొత్తఁగదవే
(॥జాణ॥)
గుడి(ది?) కొన్న లేఁతసిగ్గుల దొంతి
వెదచల్లుఁ బులకవిరులబంతి
పదిలపు నడపుల పట్టపుదంతి
యిదె శ్రీవేంకటేశ్వరుఁ డెనసె మెచ్చఁగదే
(||pallavi||)
jāṇa valabula tĕṁki javādivaṁki
nāṇĕmaina padidoḍa navvu navvam̐gadave
(||jāṇa||)
kāḍuga kanusūbula kaligī
gām̐ṭabu mām̐ṭala silugalu kŏligī
sāḍuva kĕkkina yaṭṭi jāji muligī
pāḍiṁchi nī vibhunigi bāgā liyyam̐gadave
(||jāṇa||)
nĕlagŏnna navvula vĕnnĕladeḍa
kulugum̐ guttigaloni kŏvilabāḍa
vĕlayam̐ jittajageḽi veḍuga koḍa
talagŏni nīmaganibādama lŏttam̐gadave
(||jāṇa||)
guḍi(di?) kŏnna lem̐tasiggula dŏṁti
vĕdasallum̐ bulagavirulabaṁti
padilabu naḍabula paṭṭabudaṁti
yidĕ śhrīveṁkaḍeśhvarum̐ ḍĕnasĕ mĕchcham̐gade