జాము వోయ నింకాను సటలేఁటికే
(॥పల్లవి॥)
జాము వోయ నింకాను సటలేఁటికే
నీ మతక మింతయు నే మెఱగమా
(॥జాము॥)
సిగ్గులెందాఁకానే చెఱఁగు వట్టెను పతి
యెగ్గు లెందాఁకనే యిదె మొక్కీని
నిగ్గుఁజల మెందాఁకానే ని న్నాతఁడు వేఁడుకొనీ
వొగ్గి విడె మిమ్మంటే వోపనందురా
(॥జాము॥)
పెనగు లెందాఁకానే ప్రియపడీ రమణుఁడు
కినుక లెందాఁకానే కిందుపడీని
జనుగు లెందాంకానే చోటిచ్చీఁ గూడుమంటా
నిను గుంచ వేయుమంటా నేరనందురా
(॥జాము॥)
చిఱునవ్వుం లెందాఁకానే శ్రీవేంకటేశుఁడు గూడె
నెఱి నలమేల్మంగవు నిన్ను నిప్పుడే
వెఱగు లెందాఁకనే విచ్చనవిళ్లాయ నీకు
మఱియుఁ గొసరితేను మచ్చరింతురా
(||pallavi||)
jāmu voya niṁkānu saḍalem̐ṭige
nī madaga miṁtayu ne mĕṟagamā
(||jāmu||)
siggulĕṁdām̐kāne sĕṟam̐gu vaṭṭĕnu padi
yĕggu lĕṁdām̐kane yidĕ mŏkkīni
niggum̐jala mĕṁdām̐kāne ni nnādam̐ḍu vem̐ḍugŏnī
vŏggi viḍĕ mimmaṁṭe vobanaṁdurā
(||jāmu||)
pĕnagu lĕṁdām̐kāne priyabaḍī ramaṇum̐ḍu
kinuga lĕṁdām̐kāne kiṁdubaḍīni
janugu lĕṁdāṁkāne soḍichchīm̐ gūḍumaṁṭā
ninu guṁcha veyumaṁṭā neranaṁdurā
(||jāmu||)
siṟunavvuṁ lĕṁdām̐kāne śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
nĕṟi nalamelmaṁgavu ninnu nippuḍe
vĕṟagu lĕṁdām̐kane vichchanaviḽlāya nīgu
maṟiyum̐ gŏsaridenu machchariṁturā