Jaagu lemidige sadulaalaa

జాగు లేమిటికె సతులాలా
Language

(॥పల్లవి॥)
జాగు లేమిటికె సతులాలా
తీగెలు సాగెను తీరని వలపు

(॥జాగు॥)
రంతుల నీడకు రమణుఁడు విచ్చేసె
యింత వొద్దు వోయినవెనక
బంతికిఁ బిలువరె పట్టరె జలకము
దొంతుల నున్నది తొల్లిటివలపు

(॥జాగు॥)
తలఁచుకొనె నదివో తననిజబాసలు
చెలఁగి యిల్లు చొచ్చినవెనక
పిలువరె యీడకు పీఁట వెట్టి రే
పులియ దెప్పుడును పూఁచినవలపు

(॥జాగు॥)
ఆరగించి నను నట్టె కూడెను
చేరి వరుస గలసినవెనక
యీ రీతి శ్రీవేంకటేశుకు మొక్కరె
పేరెను పైపై ప్రియములవలపు

(||pallavi||)
jāgu lemiḍigĕ sadulālā
tīgĕlu sāgĕnu tīrani valabu

(||jāgu||)
raṁtula nīḍagu ramaṇum̐ḍu vichchesĕ
yiṁta vŏddu voyinavĕnaga
baṁtigim̐ biluvarĕ paṭṭarĕ jalagamu
dŏṁtula nunnadi tŏlliḍivalabu

(||jāgu||)
talam̐sugŏnĕ nadivo tananijabāsalu
sĕlam̐gi yillu sŏchchinavĕnaga
piluvarĕ yīḍagu pīm̐ṭa vĕṭṭi re
puliya dĕppuḍunu pūm̐sinavalabu

(||jāgu||)
āragiṁchi nanu naṭṭĕ kūḍĕnu
seri varusa galasinavĕnaga
yī rīdi śhrīveṁkaḍeśhugu mŏkkarĕ
perĕnu paibai priyamulavalabu