ఇయ్యఁగదె కానుక నీయెదుట నున్నాఁ డతఁడు
(॥పల్లవి॥)
ఇయ్యఁగదె కానుక నీయెదుట నున్నాఁ డతఁడు
నెయ్యపు మాట లాడఁగా నేనోపనందురా
(॥॥)
దవ్వులనుండి యాతఁడు తగుల నిన్నుఁ జూచితే
నవ్వుదురుగాక వదనము వంతురా
పువ్వులచెండున నిట్టె పూఁచి నిన్ను వేసితేను
వువ్విళ్ళూర మొక్కుటగా కూరకవుండుదురా
(॥॥)
మలసి సొలసి నీతో మాట లాతఁ డాడఁగాను
చెలిమిసేతురు గాక చేరకుందురా
పిలిచి నిన్నుఁ బేర్కొని ప్రియములు చెప్పఁగాను
కొలువుసేతురుగాక గుట్టునఁ గొంకుదురా
(॥॥)
శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁ జిత్తగించి కూడఁగాను
భావించలమేల్మంగవు పదరుదురా
చేవమీరి నీకతఁడు సేసలిట్టె పెట్టఁగాను
వేవేలై మెత్తురుగాక వెంగెము లాడుదురా
(||pallavi||)
iyyam̐gadĕ kānuga nīyĕduḍa nunnām̐ ḍadam̐ḍu
nĕyyabu māḍa lāḍam̐gā nenobanaṁdurā
(||||)
davvulanuṁḍi yādam̐ḍu tagula ninnum̐ jūside
navvudurugāga vadanamu vaṁturā
puvvulasĕṁḍuna niṭṭĕ pūm̐si ninnu vesidenu
vuvviḽḽūra mŏkkuḍagā kūragavuṁḍudurā
(||||)
malasi sŏlasi nīdo māḍa lādam̐ ḍāḍam̐gānu
sĕlimiseduru gāga seraguṁdurā
pilisi ninnum̐ bergŏni priyamulu sĕppam̐gānu
kŏluvusedurugāga guṭṭunam̐ gŏṁkudurā
(||||)
śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐ jittagiṁchi kūḍam̐gānu
bhāviṁchalamelmaṁgavu padarudurā
sevamīri nīgadam̐ḍu sesaliṭṭĕ pĕṭṭam̐gānu
vevelai mĕtturugāga vĕṁgĕmu lāḍudurā