(॥పల్లవి॥)
ఇయ్యకొనవోయి మాట యేమోయి
నెయ్యపు నెచ్చెలులకు నీరాయ మనసులు
(॥ఇయ్య॥)
మొకము చూడఁగానే మోహము చల్లీ నాపె
యెకసక్కేలాడేవు యోమోయి
చికుర భరము వంచి సిగ్గు వడె నంతలోను
సుకానఁ జూచువారికి చురుకనె గుండెలు
(॥ఇయ్య॥)
సింగారించుకొనఁగానే చేయివట్టి తీసీనాపె
ఇంగిత మెఱఁగలేవు యేమోఇ
ముంగిట నివ్వెరగంది మోనన నున్న దిందుకు
సంగడినున్నవారికి జల్ల ననె మేనులు
(॥ఇయ్య॥)
కందువ నీ కుండఁగానే కాఁగిటఁ గూడె నాపె
ఎందరిని భ్రమఇంచే వేమోఇ
అంది శ్రీ వేకంటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
ముందు వెనకవారికి మూఁడేశాయ మూఁపులు
(||pallavi||)
iyyagŏnavoyi māḍa yemoyi
nĕyyabu nĕchchĕlulagu nīrāya manasulu
(||iyya||)
mŏgamu sūḍam̐gāne mohamu sallī nābĕ
yĕgasakkelāḍevu yomoyi
sigura bharamu vaṁchi siggu vaḍĕ naṁtalonu
sugānam̐ jūsuvārigi suruganĕ guṁḍĕlu
(||iyya||)
siṁgāriṁchugŏnam̐gāne seyivaṭṭi tīsīnābĕ
iṁgida mĕṟam̐galevu yemoi
muṁgiḍa nivvĕragaṁdi monana nunna diṁdugu
saṁgaḍinunnavārigi jalla nanĕ menulu
(||iyya||)
kaṁduva nī kuṁḍam̐gāne kām̐giḍam̐ gūḍĕ nābĕ
ĕṁdarini bhrama̮iṁche vemoi
aṁdi śhrī vegaṁṭeśhum̐ḍa aṭṭĕ nannum̐gūḍidivi
muṁdu vĕnagavārigi mūm̐ḍeśhāya mūm̐pulu