ఇయ్యకొనవద్దా నీవేమిటికైనా
(॥పల్లవి॥)
ఇయ్యకొనవద్దా నీవేమిటికైనా
పయ్యదంటి యాతఁడు పనులు చెప్పఁగను
(॥ఇయ్య॥)
చలము సాదించకువే సారె సారెను
చెలువుఁడు వేఁడుకొని చెక్కు నొక్కీని
పెలుచవై యానలు పెట్టుదురటే
చెలరేఁగి యాతఁడు చేతులు చాఁచగను
(॥ఇయ్య॥)
మంకులు నెరపకువే మాఁటిమాఁటికి
అంకెలనాతఁడు నిన్ను నలమీని
సంకెలేక బొమ్మలను జంకింతురటే
వంకలొత్తి కొనగోర వలపు రేఁచఁగను
(॥ఇయ్య॥)
పొదిగి పెనఁగకువే పొద్దు వొద్దుకు
యిదివో శ్రీ వేంకటేశుఁడెనసె నేఁడు
సదరమనుచును కొసరుదురటే
పదిమారులును నీకు బాఁతిపడఁగాను
(||pallavi||)
iyyagŏnavaddā nīvemiḍigainā
payyadaṁṭi yādam̐ḍu panulu sĕppam̐ganu
(||iyya||)
salamu sādiṁchaguve sārĕ sārĕnu
sĕluvum̐ḍu vem̐ḍugŏni sĕkku nŏkkīni
pĕlusavai yānalu pĕṭṭuduraḍe
sĕlarem̐gi yādam̐ḍu sedulu sām̐saganu
(||iyya||)
maṁkulu nĕrabaguve mām̐ṭimām̐ṭigi
aṁkĕlanādam̐ḍu ninnu nalamīni
saṁkĕlega bŏmmalanu jaṁkiṁturaḍe
vaṁkalŏtti kŏnagora valabu rem̐sam̐ganu
(||iyya||)
pŏdigi pĕnam̐gaguve pŏddu vŏddugu
yidivo śhrī veṁkaḍeśhum̐ḍĕnasĕ nem̐ḍu
sadaramanusunu kŏsaruduraḍe
padimārulunu nīgu bām̐tibaḍam̐gānu