Iyyagona vaddaa nee vimtada nainaa

ఇయ్యకొన వద్దా నీ వింతట నైనా
Language

(॥పల్లవి॥)
ఇయ్యకొన వద్దా నీ వింతట నైనా
అయ్యో యేమయ్య నీకు ఆసపడీఁ జెలియా

(॥ఇయ్యకొన॥)
చెక్కుల జవ్వాది జార చిరునవ్వు మోవిఁ దేర
నిక్కి చూచి మోహించె నీకు నల్లదె
చక్కని యా లలితాంగి సారె సారె మాఁటలలో
మక్కువ వలపు చల్లీ మదనరాగమునా

(॥ఇయ్యకొన॥)
తను వెల్లఁ జెమరించి తరిపులకలు నించి
మనసు నీ కప్పగించి మలసీ నదె
అనుఁగుఁబాయపుసతి ఆడనుండి సన్న సేసి
తనుఁ దానె కరఁగీని దప్పి దేరే మోవిని

(॥ఇయ్యకొన॥)
ముచ్చట సిగ్గులు వీఁగ ముక్కున నూర్పులు రేఁగ
యిచ్చటికి విచ్చేసె నింతలో నాపె
పచ్చిగా శ్రీవెంకటేశ పడఁతి నిన్నిటు గూడి
తచ్చన నీతో నాడీ తమకపురతులా

(||pallavi||)
iyyagŏna vaddā nī viṁtaḍa nainā
ayyo yemayya nīgu āsabaḍīm̐ jĕliyā

(||iyyagŏna||)
sĕkkula javvādi jāra sirunavvu movim̐ dera
nikki sūsi mohiṁchĕ nīgu nalladĕ
sakkani yā lalidāṁgi sārĕ sārĕ mām̐ṭalalo
makkuva valabu sallī madanarāgamunā

(||iyyagŏna||)
tanu vĕllam̐ jĕmariṁchi taribulagalu niṁchi
manasu nī kappagiṁchi malasī nadĕ
anum̐gum̐bāyabusadi āḍanuṁḍi sanna sesi
tanum̐ dānĕ karam̐gīni dappi dere movini

(||iyyagŏna||)
muchchaḍa siggulu vīm̐ga mukkuna nūrbulu rem̐ga
yichchaḍigi vichchesĕ niṁtalo nābĕ
pachchigā śhrīvĕṁkaḍeśha paḍam̐ti ninniḍu gūḍi
tachchana nīdo nāḍī tamagaburadulā