ఇయ్యకొంటి రావయ్యా యీడకే నీవు
(॥పల్లవి॥)
ఇయ్యకొంటి రావయ్యా యీడకే నీవు
పయ్యద నీవంటఁగా పదరనేమిటికి
(॥ఇయ్య॥)
వలపు గలిఁగితేఁగాక వంతులకు సారె సారె
చలము సాదించఁబోతే చవివుట్టీనా
అలరి ఇంకానేల ఆ సుద్దులు దడవఁగా
అలమి పైకొనేనీతో నలుఁగనేమిటికి
(॥ఇయ్య॥)
చిత్తము వచ్చినఁగాక చేయివట్టి నీతోను
వొత్తి విన్నవించఁబోతే వొడఁబడేనా
తత్తరించనేమిటికి తలఁచిన పనులాయ
కొత్తలుగా నవ్వఁగాను కొసరనేమిటికి
(॥ఇయ్య॥)
ఆదరించితేఁగాక ఆసోదానఁ గాఁగిలించి
ఆదుకొని పెనఁగితే నందమయ్యీనా
యీదెస శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
సాదవై యుండిన నన్ను జంకించనేమిటికి
(||pallavi||)
iyyagŏṁṭi rāvayyā yīḍage nīvu
payyada nīvaṁṭam̐gā padaranemiḍigi
(||iyya||)
valabu galim̐gidem̐gāga vaṁtulagu sārĕ sārĕ
salamu sādiṁcham̐bode savivuṭṭīnā
alari iṁkānela ā suddulu daḍavam̐gā
alami paigŏnenīdo nalum̐ganemiḍigi
(||iyya||)
sittamu vachchinam̐gāga seyivaṭṭi nīdonu
vŏtti vinnaviṁcham̐bode vŏḍam̐baḍenā
tattariṁchanemiḍigi talam̐sina panulāya
kŏttalugā navvam̐gānu kŏsaranemiḍigi
(||iyya||)
ādariṁchidem̐gāga āsodānam̐ gām̐giliṁchi
ādugŏni pĕnam̐gide naṁdamayyīnā
yīdĕsa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sādavai yuṁḍina nannu jaṁkiṁchanemiḍigi