Iyyagomti raavayya imtigi neevu

ఇయ్యకొంటి రావయ్య ఇంటికి నీవు
Language

(॥పల్లవి॥)
ఇయ్యకొంటి రావయ్య ఇంటికి నీవు
నెయ్యముగలచోటికి నేరము లెక్కడివి

(॥॥)
సిగ్గుపడి నీయెదుట చెక్కుపైఁ జెయ్యిడుకొంటే
దిగ్గన నీ వంతలోనే తీసి వేసేవు
యెగ్గులెంచఁ దప్పులెంచ నేలసిబ్బితిపడేవు
సిగ్గుల నింత గలిగితే నేరము లెక్కడివి

(॥॥)
ముక్కుపై వేలిడుకొని ముందర నిలిచితేను
చక్కనుండుమని వేలు సారెఁ బట్టేవు
కక్కసించితినా నిన్ను కమ్మటి నేలలోఁగేవు
నిక్కపుఁ జుట్టములైతే నేరము లెక్కడివి

(॥॥)
తఱితోఁ జన్నులుమోవఁ దలవంచుకొంటేను
గుఱిగాఁ గాఁగిలించేవు కొప్పువట్టెత్తి
యెఱఁగవా శ్రీ వేంకటేశ నన్నేలితివి
నెఱజాణతనములే నేరము లెక్కడివి

(||pallavi||)
iyyagŏṁṭi rāvayya iṁṭigi nīvu
nĕyyamugalasoḍigi neramu lĕkkaḍivi

(||||)
siggubaḍi nīyĕduḍa sĕkkubaim̐ jĕyyiḍugŏṁṭe
diggana nī vaṁtalone tīsi vesevu
yĕggulĕṁcham̐ dappulĕṁcha nelasibbidibaḍevu
siggula niṁta galigide neramu lĕkkaḍivi

(||||)
mukkubai veliḍugŏni muṁdara nilisidenu
sakkanuṁḍumani velu sārĕm̐ baṭṭevu
kakkasiṁchidinā ninnu kammaḍi nelalom̐gevu
nikkabum̐ juṭṭamulaide neramu lĕkkaḍivi

(||||)
taṟidom̐ jannulumovam̐ dalavaṁchugŏṁṭenu
guṟigām̐ gām̐giliṁchevu kŏppuvaṭṭĕtti
yĕṟam̐gavā śhrī veṁkaḍeśha nannelidivi
nĕṟajāṇadanamule neramu lĕkkaḍivi