ఇయ్యకొంటి నిఁక నీ యిచ్చాయను
(॥పల్లవి॥)
ఇయ్యకొంటి నిఁక నీ యిచ్చాయను
కొయ్యతనాలదాననా కొసరితిఁ గాక
(॥॥)
యొనయక నీతోను యెదురాడేదాననా
అనవల శొకమాట అడితిఁ గాక
పెనఁగుచు నీతోను బిగిసేటిదాననా
చనవు మెఱసి కొంతజంకించితిఁ గాక
(॥॥)
యెడచొచ్చి నీపట్టుకు నెగసక్కెపుదాననా
నడుమ నూరకే నీతో నవ్వితిఁ గాక
జడిగొని నిన్ను మీరి సాదించేదాననా
వుడివోని చన్నుల నొత్తితిఁ గాక
(॥॥)
సొరిది గబ్బితనము చూపేటిదాననా
కెరలి కాఁగిటను బిగించితిఁ గాక
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
జరగేదాననా మోవి చవిగొంటిఁ గాక
(||pallavi||)
iyyagŏṁṭi nim̐ka nī yichchāyanu
kŏyyadanāladānanā kŏsaridim̐ gāga
(||||)
yŏnayaga nīdonu yĕdurāḍedānanā
anavala śhŏgamāḍa aḍidim̐ gāga
pĕnam̐gusu nīdonu bigiseḍidānanā
sanavu mĕṟasi kŏṁtajaṁkiṁchidim̐ gāga
(||||)
yĕḍasŏchchi nībaṭṭugu nĕgasakkĕbudānanā
naḍuma nūrage nīdo navvidim̐ gāga
jaḍigŏni ninnu mīri sādiṁchedānanā
vuḍivoni sannula nŏttidim̐ gāga
(||||)
sŏridi gabbidanamu sūbeḍidānanā
kĕrali kām̐giḍanu bigiṁchidim̐ gāga
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
jaragedānanā movi savigŏṁṭim̐ gāga