Iyyagomti neebanulu imtaa mele

ఇయ్యకొంటి నీపనులు ఇంతా మేలే
Language

(॥పల్లవి॥)
ఇయ్యకొంటి నీపనులు ఇంతా మేలే
చెయ్యిమీఁదాయ నాకు సిరులేమి బాఁతి

(॥ఇయ్య॥)
నయగారివాఁడవునాకు నీవు గలవు
ప్రియములేమి గడమ పెక్కుమారులు
క్రియ లెఱుఁగుదువు కేలు చాఁచేవు నామీఁద
నియతా నిందుకే నీయాలనైతిని

(॥ఇయ్య॥)
చలపాదివాఁడవు సతమై వున్నాఁడవు
బలిమి యేమి గడమ పై పై నేఁడు
వలపించనేరుతువు వంచేవు నాపై ననుపు
కలకాలమును నీకుఁ గైవశమైతిని

(॥ఇయ్య॥)
శ్రీవేంకటేశుఁడవు చేరి నన్నుఁ గూడితివి
దైవిక మేమిగడమ తగులాయను
భావ మెఱుఁగుదువు పచ్చిగా నవ్వేవు నాతో
వేవేలకును నీకే వెల్లవిరి యైతిని

(||pallavi||)
iyyagŏṁṭi nībanulu iṁtā mele
sĕyyimīm̐dāya nāgu sirulemi bām̐ti

(||iyya||)
nayagārivām̐ḍavunāgu nīvu galavu
priyamulemi gaḍama pĕkkumārulu
kriya lĕṟum̐guduvu kelu sām̐sevu nāmīm̐da
niyadā niṁduge nīyālanaidini

(||iyya||)
salabādivām̐ḍavu sadamai vunnām̐ḍavu
balimi yemi gaḍama pai pai nem̐ḍu
valabiṁchaneruduvu vaṁchevu nābai nanubu
kalagālamunu nīgum̐ gaivaśhamaidini

(||iyya||)
śhrīveṁkaḍeśhum̐ḍavu seri nannum̐ gūḍidivi
daiviga memigaḍama tagulāyanu
bhāva mĕṟum̐guduvu pachchigā navvevu nādo
vevelagunu nīge vĕllaviri yaidini