ఇయ్యకొంటి నీ మాటలు యింకానేల
(॥పల్లవి॥)
ఇయ్యకొంటి నీ మాటలు యింకానేల
నెయ్యమెల్లాఁ గానవచ్చె నేర మెంచనేఁటికి
(॥ఇయ్య॥)
వెలయ నందరితోడా వేసరక నవ్వేవు
చలమరిసరసాలు సాజమే నీకు
పిలువకతొల్లె వచ్చి పీఁటమీఁదఁ గూచుండేవు
బలిమి తమకములు పచ్చిదేరె నీకు
(॥ఇయ్య॥)
సొరిది నెందరినైనా సూటిగానే చూచేవు
తరితీపుల యాసలు తగవే నీకు
మరిగి నాతో నీవు, మాటలు నన్నాడించేవు
సురతాన నూరికెల్లా జుట్టుమవే నీవు
(॥ఇయ్య॥)
కమ్ముక యెందరినైనాఁ గాఁగిలించి కూడేవు
యిమ్ముల నిచ్చసోబనా లితవే నీకు
కమ్మర శ్రీవేంకటేశ గక్కన నన్నేలితివి
నెమ్మది నీ కీరితి నిండుకొనె నిపుడు
(||pallavi||)
iyyagŏṁṭi nī māḍalu yiṁkānela
nĕyyamĕllām̐ gānavachchĕ nera mĕṁchanem̐ṭigi
(||iyya||)
vĕlaya naṁdaridoḍā vesaraga navvevu
salamarisarasālu sājame nīgu
piluvagadŏllĕ vachchi pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍevu
balimi tamagamulu pachchiderĕ nīgu
(||iyya||)
sŏridi nĕṁdarinainā sūḍigāne sūsevu
taridībula yāsalu tagave nīgu
marigi nādo nīvu, māḍalu nannāḍiṁchevu
suradāna nūrigĕllā juṭṭumave nīvu
(||iyya||)
kammuga yĕṁdarinainām̐ gām̐giliṁchi kūḍevu
yimmula nichchasobanā lidave nīgu
kammara śhrīveṁkaḍeśha gakkana nannelidivi
nĕmmadi nī kīridi niṁḍugŏnĕ nibuḍu