Iyyagolu sese meemda nemi gallaanu

ఇయ్యకోలు సేసే మీఁద నేమి గల్లాను
Language

(॥పల్లవి॥)
ఇయ్యకోలు సేసే మీఁద నేమి గల్లాను
వియ్యపు సమ్మంధాల విడె మిందవయ్య

(॥ఇయ్య॥)
ముచ్చట లాడేటి వేళ ముద్దులు గురుతుఁగాక
యెచ్చుకుందు లాడుదునా ఇప్పుడు నీతో
ఇచ్చకము సేసితివి ఇంటికి విచ్చేసి నీవు
అచ్చపు మామోవి విందు ఆరగించవయ్యా

(॥ఇయ్య॥)
కన్నుల నవ్వేటివేళ కందువ లంటుదుఁగాక
సన్నల నోరార్తునా సారెకు నీతో
మన్నన నా కిచ్చితివి మరులుగొంటివి నాకు
పన్నిన నా చన్నులఁ గప్పముఁ గొనవయ్యా

(॥ఇయ్య॥)
రతులఁ గూడేటి వేళ రసము లానింతుఁగాక
తతి దప్పింతునా మరి దాకొని నీతో
కతగా శ్రీ వేంకటేశ కలసితి మిద్దరము
మితిమీరి మోహముల మెప్పించు కోవయ్యా

(||pallavi||)
iyyagolu sese mīm̐da nemi gallānu
viyyabu sammaṁdhāla viḍĕ miṁdavayya

(||iyya||)
muchchaḍa lāḍeḍi veḽa muddulu gurudum̐gāga
yĕchchuguṁdu lāḍudunā ippuḍu nīdo
ichchagamu sesidivi iṁṭigi vichchesi nīvu
achchabu māmovi viṁdu āragiṁchavayyā

(||iyya||)
kannula navveḍiveḽa kaṁduva laṁṭudum̐gāga
sannala norārdunā sārĕgu nīdo
mannana nā kichchidivi marulugŏṁṭivi nāgu
pannina nā sannulam̐ gappamum̐ gŏnavayyā

(||iyya||)
radulam̐ gūḍeḍi veḽa rasamu lāniṁtum̐gāga
tadi dappiṁtunā mari dāgŏni nīdo
kadagā śhrī veṁkaḍeśha kalasidi middaramu
midimīri mohamula mĕppiṁchu kovayyā