ఇయ్యకోలయిన మీఁద నిఁక నేలా
(॥పల్లవి॥)
ఇయ్యకోలయిన మీఁద నిఁక నేలా
నెయ్యము లాతఁడు నాపై నెరపీఁ జూడరే
(॥ఇయ్యకో॥)
యెన్నినేరా లైనఁ గానీ యెక్కడ నైనా నుండనీ
వన్నెగా నేర మ్మంటే వచ్చెఁగా తాను
మన్ననలు నా కిచ్చె మాఁటలూ నాచేత వినె
మున్నిటి సుద్దులిం కేమీ ముదులకించకురే
(॥ఇయ్యనో॥)
యెం దైనా సన్న సేయనీ యెవ్వ తైనాఁ గూడనీ
యిందు నాపై నాన వెట్టె నిప్పుడే తానూ
అంది నాపైఁ జేయి వేసే నంతరగ మెల్లఁ జెప్పె
నింద లాడేమాట లెల్ల నిలువఁ బెట్టకురే
(॥ఇయ్యకో॥)
మన సెట్టైనై నుండనీ మంతనాలె యాడనీ
కొన కెక్క నను నేఁడు గూడెఁగా తాను
యెనసెను శ్రీవెంకటేశ్వరుఁ డీతమితోడ
నను పైతి మిద్దరము నవ్వులు నవ్వకురే
(||pallavi||)
iyyagolayina mīm̐da nim̐ka nelā
nĕyyamu lādam̐ḍu nābai nĕrabīm̐ jūḍare
(||iyyago||)
yĕnninerā lainam̐ gānī yĕkkaḍa nainā nuṁḍanī
vannĕgā nera mmaṁṭe vachchĕm̐gā tānu
mannanalu nā kichchĕ mām̐ṭalū nāseda vinĕ
munniḍi sudduliṁ kemī mudulagiṁchagure
(||iyyano||)
yĕṁ dainā sanna seyanī yĕvva tainām̐ gūḍanī
yiṁdu nābai nāna vĕṭṭĕ nippuḍe tānū
aṁdi nābaim̐ jeyi vese naṁtaraga mĕllam̐ jĕppĕ
niṁda lāḍemāḍa lĕlla niluvam̐ bĕṭṭagure
(||iyyago||)
mana sĕṭṭainai nuṁḍanī maṁtanālĕ yāḍanī
kŏna kĕkka nanu nem̐ḍu gūḍĕm̐gā tānu
yĕnasĕnu śhrīvĕṁkaḍeśhvarum̐ ḍīdamidoḍa
nanu paidi middaramu navvulu navvagure