Iyyagolainasoda yeravu lela

ఇయ్యకోలైనచోట యెరవు లేల
Language

(॥పల్లవి॥)
ఇయ్యకోలైనచోట యెరవు లేల
చెయ్యారా వీడె మిచ్చి చెనకఁగ రాదా

(॥ఇయ్య॥)
చనవరిదాన నంటా లిగె నెంపే నంటా
పెనఁగేవు పతితోను పిలువఁ గానే
తనివోదు తమకము తడ వాయ సముకము
మనసిచ్చి యీతనితో మాటలాడ రాదా

(॥ఇయ్య॥)
చక్కనిదాన నంటా సాదించఁ గల నంటా
కక్కసించే వాతఁడు గారవించఁగా
మక్కువ తొల్లె కలదు మారుమాటాడ వలదు
చెక్కునొక్కి యాతనిపై సేన వెట్టి రాదా

(॥ఇయ్య॥)
పంతపుదాననంటా పాయరాని దాననంటా
వింతలు చేసేవు శ్రీ వేంకటేశ,
యింతలోనే కలయిక యిద్దరికి నలయిక
చింత దీర నాతనికి చేత మొక్క రాదా

(||pallavi||)
iyyagolainasoḍa yĕravu lela
sĕyyārā vīḍĕ michchi sĕnagam̐ga rādā

(||iyya||)
sanavaridāna naṁṭā ligĕ nĕṁpe naṁṭā
pĕnam̐gevu padidonu piluvam̐ gāne
tanivodu tamagamu taḍa vāya samugamu
manasichchi yīdanido māḍalāḍa rādā

(||iyya||)
sakkanidāna naṁṭā sādiṁcham̐ gala naṁṭā
kakkasiṁche vādam̐ḍu gāraviṁcham̐gā
makkuva tŏllĕ kaladu mārumāḍāḍa valadu
sĕkkunŏkki yādanibai sena vĕṭṭi rādā

(||iyya||)
paṁtabudānanaṁṭā pāyarāni dānanaṁṭā
viṁtalu sesevu śhrī veṁkaḍeśha,
yiṁtalone kalayiga yiddarigi nalayiga
siṁta dīra nādanigi seda mŏkka rādā