(॥పల్లవి॥)
ఇయ్యకోలైనమీఁద యెరవేలమ్మా
నెయ్యమున సంతోసాలు నించుకోరమ్మా
(॥ఇయ్య॥)
రమణుఁ డింటికి వచ్చె రతులను నిన్ను మెచ్చె
తమకించి తప్పు లెంచఁదగదమ్మా
చెమటలు మేన నిండె చిత్తములు మీకుఁ బండె
జమళి నిద్దరు సరసము లాడరమ్మా
(॥ఇయ్య॥)
చెలువుఁడు నీకు దక్కె చేరి నీ చెక్కులు నొక్కె
చలము లింతట నిఁకఁ జాలునమ్మా
మొలకనవ్వులు మీరె మోమునఁ గళలు దేరె
కలసిమెలసి మీ రొక్కటియై యుండరమ్మా
(॥ఇయ్య॥)
శ్రీవేంకటేశుఁడు గూడె చెంది నీతో జూజమాడె
యావేళ పంతాలాడ నేఁటికమ్మా
వావులు మీకు దొరసె వలపు లిట్టె మెరసె
పూవుఁ బరిమళమునై పొసఁగరమ్మా
(||pallavi||)
iyyagolainamīm̐da yĕravelammā
nĕyyamuna saṁtosālu niṁchugorammā
(||iyya||)
ramaṇum̐ ḍiṁṭigi vachchĕ radulanu ninnu mĕchchĕ
tamagiṁchi tappu lĕṁcham̐dagadammā
sĕmaḍalu mena niṁḍĕ sittamulu mīgum̐ baṁḍĕ
jamaḽi niddaru sarasamu lāḍarammā
(||iyya||)
sĕluvum̐ḍu nīgu dakkĕ seri nī sĕkkulu nŏkkĕ
salamu liṁtaḍa nim̐kam̐ jālunammā
mŏlaganavvulu mīrĕ momunam̐ gaḽalu derĕ
kalasimĕlasi mī rŏkkaḍiyai yuṁḍarammā
(||iyya||)
śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ sĕṁdi nīdo jūjamāḍĕ
yāveḽa paṁtālāḍa nem̐ṭigammā
vāvulu mīgu dŏrasĕ valabu liṭṭĕ mĕrasĕ
pūvum̐ barimaḽamunai pŏsam̐garammā