Iyyago lainameemda nera vela

ఇయ్యకో లైనమీఁద నెర వేల
Language

(॥పల్లవి॥)
ఇయ్యకో లైనమీఁద నెర వేల
కయ్యము దీరినమీఁద కపట మేల

(॥ఇయ్య॥)
నిలుచున్నపతిఁ జూచి నెయ్యముతో నవ్వవమ్మ
పిలువ నంపినమీఁద బిగు వేల
తలఁపులు గలిగితేను తనువులు సోఁకవద్దా
అలరి తొలుత నన్నీ నమరుఁగాక

(॥ఇయ్య॥)
చెనకి లోని కతని చెయివట్టి తియ్యవమ్మ
మనసు లెనసిన మరి మరఁ గేల
పెనఁగేయంత గలితే ప్రియములు చెప్పవద్దా
వినుకలిమీఁద మరి వింత లేల

(॥ఇయ్య॥)
చిక్కించుక ఆతనికి సేవలెల్లఁ జేయవమ్మ
గక్కనఁ గూడినమీఁద గర్వమేల
యెక్కున శ్రీ వేంకటేశు నెనసితి వింతలోనె
దక్కినపనులు మరి తడవనేల

(||pallavi||)
iyyago lainamīm̐da nĕra vela
kayyamu dīrinamīm̐da kabaḍa mela

(||iyya||)
nilusunnabadim̐ jūsi nĕyyamudo navvavamma
piluva naṁpinamīm̐da bigu vela
talam̐pulu galigidenu tanuvulu som̐kavaddā
alari tŏluda nannī namarum̐gāga

(||iyya||)
sĕnagi loni kadani sĕyivaṭṭi tiyyavamma
manasu lĕnasina mari maram̐ gela
pĕnam̐geyaṁta galide priyamulu sĕppavaddā
vinugalimīm̐da mari viṁta lela

(||iyya||)
sikkiṁchuga ādanigi sevalĕllam̐ jeyavamma
gakkanam̐ gūḍinamīm̐da garvamela
yĕkkuna śhrī veṁkaḍeśhu nĕnasidi viṁtalonĕ
dakkinabanulu mari taḍavanela