Iviyellaa maagela illaamdlamu nemu

ఇవియెల్లా మాకేల ఇల్లాండ్లము నేము
Language

(॥పల్లవి॥)
ఇవియెల్లా మాకేల ఇల్లాండ్లము నేము
అవియెల్లా నెచ్చరించు మాపెకే నీవు

(॥ఇవి॥)
వలపులలోపలి వాసు లేమిగలిగినా
నెలఁతకు నన్నియును నేరుపవయ్యా
పలుకులతోపలిపాడిపంతములునట్టే
అలవాటు సేయవయ్య అపెకే నీవు

(॥ఇవి॥)
పమ్మిన చూపులలోని పగ టేమిగల్లాను
కొమ్మచేతనేచూపించుకోవయ్యా
యెమ్మలకునాతోఁ జెప్పే వింతేసికతలునేఁడు
అమ్మరో మాకేల చెప్పు మాపెకే నీవు

(॥ఇవి॥)
మంతనపురతులలో మఱఁగు లేమిగల్లాను
యింతికినీ వుపదేశ మియ్యవయ్యా
చెంతల శ్రీవేంకటేశ చేరి నన్నుఁగూడితివి
అంతటను బాససేయు మాపెకే నీవు

(||pallavi||)
iviyĕllā māgela illāṁḍlamu nemu
aviyĕllā nĕchchariṁchu mābĕge nīvu

(||ivi||)
valabulalobali vāsu lemigaliginā
nĕlam̐tagu nanniyunu nerubavayyā
paluguladobalibāḍibaṁtamulunaṭṭe
alavāḍu seyavayya abĕge nīvu

(||ivi||)
pammina sūbulaloni paga ṭemigallānu
kŏmmasedanesūbiṁchugovayyā
yĕmmalagunādom̐ jĕppe viṁtesigadalunem̐ḍu
ammaro māgela sĕppu mābĕge nīvu

(||ivi||)
maṁtanaburadulalo maṟam̐gu lemigallānu
yiṁtiginī vubadeśha miyyavayyā
sĕṁtala śhrīveṁkaḍeśha seri nannum̐gūḍidivi
aṁtaḍanu bāsaseyu mābĕge nīvu