Iviye tollidivaaru yemchi nadasina shaamti

ఇవియే తొల్లిటివారు యెంచి నడచిన శాంతి
Language

(॥పల్లవి॥)
ఇవియే తొల్లిటివారు యెంచి నడచిన శాంతి
వివరించి కొలిచితే విష్ణుఁడే శాంతి

(॥ఇవి॥)
సకలవుద్యోగములుఁ జాలించుటే శాంతి
సుకదుఃఖములు విడుచుటే శాంతి
వొక రేమి యిచ్చినాను వొల్లకుండుట శాంతి
ప్రకటించి రచ్చలకుఁ బాయుటే శాంతి

(॥ఇవి॥)
మహిమీఁది పనులెల్లా మానియుండుటే శాంతి
సహజబాంధవములు జారుటే శాంతి
బహుకుతర్కములకుఁ బారకుండుటే శాంతి
విహితవిషయముల విడుపాటే శాంతి

(॥ఇవి॥)
వూరకే నిశ్చింతమున నుండఁగలదే శాంతి
కోరకుండే సాత్వికగుణమే శాంతి
భారము శ్రీవేంకటేశుపై బెట్టుటే శాంతి
ధీరతతోడుత గుణాతీతుఁ డౌటే శాంతి

(||pallavi||)
iviye tŏlliḍivāru yĕṁchi naḍasina śhāṁti
vivariṁchi kŏliside viṣhṇum̐ḍe śhāṁti

(||ivi||)
sagalavudyogamulum̐ jāliṁchuḍe śhāṁti
sugaduḥkhamulu viḍusuḍe śhāṁti
vŏga remi yichchinānu vŏllaguṁḍuḍa śhāṁti
pragaḍiṁchi rachchalagum̐ bāyuḍe śhāṁti

(||ivi||)
mahimīm̐di panulĕllā māniyuṁḍuḍe śhāṁti
sahajabāṁdhavamulu jāruḍe śhāṁti
bahugudargamulagum̐ bāraguṁḍuḍe śhāṁti
vihidaviṣhayamula viḍubāḍe śhāṁti

(||ivi||)
vūrage niśhchiṁtamuna nuṁḍam̐galade śhāṁti
koraguṁḍe sātvigaguṇame śhāṁti
bhāramu śhrīveṁkaḍeśhubai bĕṭṭuḍe śhāṁti
dhīradadoḍuda guṇādīdum̐ ḍauḍe śhāṁti