Ivivo maa suddulu yevvarigi muddulu

ఇవివో మా సుద్దులు యెవ్వరికి ముద్దులు
Language

(॥పల్లవి॥)
ఇవివో మా సుద్దులు యెవ్వరికి ముద్దులు
వివరించి చూచుకొమ్మా వింతవింత బుద్దులు

(॥ఇది॥)
తారుకాణించఁగఁబోతే తప్పులాయ మాఁటలు
వూరకే వినఁగఁబోతే నుప్పులాయను
సారెసారెఁ జెనకఁగ చప్పనాయ వలపులు
కోరి వెనఁగఁగఁబోతే గొప్పలాయను

(॥ఇది॥)
బడిబడిఁ జేయఁబోతే పగలాయసేఁతలు
తడవినప్పుడెల్లాను తగులాయను
నడుకొత్తవినయాలు నానావగలాయను
గొడవలేని పొందులగుట్టు మిగులాయను

(॥ఇది॥)
ననిచి పెనఁగఁబోతె నవ్వులాయ నాసలు
పొనుఁగక దాఁచితేనే పువ్వులాయను
యెనసితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనే
కనుఁగొన్నరతులెల్లా కడురవ్వలాయను

(||pallavi||)
ivivo mā suddulu yĕvvarigi muddulu
vivariṁchi sūsugŏmmā viṁtaviṁta buddulu

(||idi||)
tārugāṇiṁcham̐gam̐bode tappulāya mām̐ṭalu
vūrage vinam̐gam̐bode nuppulāyanu
sārĕsārĕm̐ jĕnagam̐ga sappanāya valabulu
kori vĕnam̐gam̐gam̐bode gŏppalāyanu

(||idi||)
baḍibaḍim̐ jeyam̐bode pagalāyasem̐talu
taḍavinappuḍĕllānu tagulāyanu
naḍugŏttavinayālu nānāvagalāyanu
gŏḍavaleni pŏṁdulaguṭṭu migulāyanu

(||idi||)
nanisi pĕnam̐gam̐bodĕ navvulāya nāsalu
pŏnum̐gaga dām̐sidene puvvulāyanu
yĕnasidivi śhrīveṁkaḍeśha nannu niṁtalone
kanum̐gŏnnaradulĕllā kaḍuravvalāyanu