ఇవిగో నీ చెలిసుద్దు లిఁకఁ గరుణించవయ్య
(॥పల్లవి॥)
ఇవిగో నీ చెలిసుద్దు లిఁకఁ గరుణించవయ్య
వివరముగా విన్నవించితిమి నీకు
(॥ఇవి॥)
తలపోఁతఁ గొంతవడి తరుణి పొద్దు గడపు
చెలులతోఁ గొంతువడి చెప్పుఁ గతలు
నెలకొని కొంతవడి నీరూపు పటాన వ్రాసు
నిలుచుండి కొంతవడి నీకెదురు చూచును
(॥ఇవి॥)
నేరుపుతోఁ గొంతవడి నీమీఁది పాటలు వాడు
కూరిములఁ గొంతవడి గుబ్బతిలును
పారితెంచి కొంతవడి బయలు గాఁగిట నించు
సారెఁ గొంతవడి లోలో సరసములాడును
(॥ఇవి॥)
నెట్టుకొని కొంతవడి నిన్నుఁ బేరుకొని పిల్చు
అట్టె కొంతవడి నీకు నాసపడును
గుట్టున శ్రీవేంకటేశ కూడితి వింతలో వచ్చి
గట్టిగాఁ గొంతవడి నీగరిమ లడుగును
(||pallavi||)
ivigo nī sĕlisuddu lim̐kam̐ garuṇiṁchavayya
vivaramugā vinnaviṁchidimi nīgu
(||ivi||)
talabom̐tam̐ gŏṁtavaḍi taruṇi pŏddu gaḍabu
sĕluladom̐ gŏṁtuvaḍi sĕppum̐ gadalu
nĕlagŏni kŏṁtavaḍi nīrūbu paḍāna vrāsu
nilusuṁḍi kŏṁtavaḍi nīgĕduru sūsunu
(||ivi||)
nerubudom̐ gŏṁtavaḍi nīmīm̐di pāḍalu vāḍu
kūrimulam̐ gŏṁtavaḍi gubbadilunu
pāridĕṁchi kŏṁtavaḍi bayalu gām̐giḍa niṁchu
sārĕm̐ gŏṁtavaḍi lolo sarasamulāḍunu
(||ivi||)
nĕṭṭugŏni kŏṁtavaḍi ninnum̐ berugŏni pilsu
aṭṭĕ kŏṁtavaḍi nīgu nāsabaḍunu
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidi viṁtalo vachchi
gaṭṭigām̐ gŏṁtavaḍi nīgarima laḍugunu