Ivigo naa korigalu iduvamtivi

ఇవిగో నా కోరికలు ఇటువంటివి
Language

(॥పల్లవి॥)
ఇవిగో నా కోరికలు ఇటువంటివి
వివరముగా నీకు విన్నపము సేసితి

(॥ఇవి॥)
కన్నుల నిన్నుఁ జూచితే కడుఁ దమకము రేఁగు
మిన్నక తలవంచితీ మించు నాసలు
చన్నులు నీపై నూఁదితే జల జలఁ జెమరించు
వున్నతి సిగ్గున నుంటే నుమ్మగిలు వలపు

(॥ఇవి॥)
ఆలించి నీమాఁట వింటే నట్టె తరితీపు వుట్టు
నాలిఁ బరాకు సేసితే నాఁటు వేడుక
మేలుమీఁద నవ్వితేను మేనఁ బులకలు నిండు
గోలతనాన లోఁగితే గుబ్బతిలు మనసు

(॥ఇవి॥)
సేవించితే నివ్వెరగు చెప్పఁగ వసము గాదు
భావించితే తలపోఁత ఫలిఇంచును
ఈవల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
దేవుల నయితి నింక తిరమౌను పనులు

(||pallavi||)
ivigo nā korigalu iḍuvaṁṭivi
vivaramugā nīgu vinnabamu sesidi

(||ivi||)
kannula ninnum̐ jūside kaḍum̐ damagamu rem̐gu
minnaga talavaṁchidī miṁchu nāsalu
sannulu nībai nūm̐dide jala jalam̐ jĕmariṁchu
vunnadi sigguna nuṁṭe nummagilu valabu

(||ivi||)
āliṁchi nīmām̐ṭa viṁṭe naṭṭĕ taridību vuṭṭu
nālim̐ barāgu seside nām̐ṭu veḍuga
melumīm̐da navvidenu menam̐ bulagalu niṁḍu
goladanāna lom̐gide gubbadilu manasu

(||ivi||)
seviṁchide nivvĕragu sĕppam̐ga vasamu gādu
bhāviṁchide talabom̐ta phaliiṁchunu
īvala śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
devula nayidi niṁka tiramaunu panulu