ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు
(॥పల్లవి॥)
ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు
జవళి నెంచిచూచితే సరిబేసివంటివి
(॥ఇవి॥)
అంగనల చూపులు ఆరతులవంటివి
కుంగక నీవు కొలువై కూచున్న వేళ
చెంగట లేఁతనవ్వులు సేసపాలవంటివి
కొంగులు వట్టుచు నీవు కొసరేటివేళ
(॥ఇవి॥)
కాంతల పలుకులెల్లా కప్పురాలవంటివి
అంతలో నీవు సరసాలాడేటివేళ
బంతిమోవుల యీవులు పాలకూళ్లవంటివి
మంతనాననుండి నీవు మన్నించేవేళను
(॥ఇవి॥)
వెలఁదుల కాఁగిళ్లు విడిదిండ్లవంటివి
చలముల నీ రతులు సలిపేవేళ
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
తలఁపులవంటివన్నీ తమకపువేళను
(||pallavi||)
ivigo mīmahimalu yemani pŏgaḍavachchu
javaḽi nĕṁchisūside saribesivaṁṭivi
(||ivi||)
aṁganala sūbulu āradulavaṁṭivi
kuṁgaga nīvu kŏluvai kūsunna veḽa
sĕṁgaḍa lem̐tanavvulu sesabālavaṁṭivi
kŏṁgulu vaṭṭusu nīvu kŏsareḍiveḽa
(||ivi||)
kāṁtala palugulĕllā kappurālavaṁṭivi
aṁtalo nīvu sarasālāḍeḍiveḽa
baṁtimovula yīvulu pālagūḽlavaṁṭivi
maṁtanānanuṁḍi nīvu manniṁcheveḽanu
(||ivi||)
vĕlam̐dula kām̐giḽlu viḍidiṁḍlavaṁṭivi
salamula nī radulu salibeveḽa
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
talam̐pulavaṁṭivannī tamagabuveḽanu