ఇవి నీకొక్కనికే యా ఇద్దరికి సరిగాక
(॥పల్లవి॥)
ఇవి నీకొక్కనికే యా ఇద్దరికి సరిగాక
తవిలి మోవితేనెలే తరితీపు సేయఁగా
(॥ఇవి॥)
నిరతి నన్నొరసేవు నీ వేమి సేతువయ్య
వొరటు నాగుబ్బలలో నుండఁగాను
యెరపరికపు గుణా లెంచ నీపై నేలయ్య
యెరపరికము నాకు నివిగో కురులను
(॥ఇవి॥)
గుట్టుతో నీమాఁటలెల్లా కొంచపరచనేలయ్య
అట్టె నానడుము కొంచమై వుండఁగా
ఱట్టయిననీచేఁత గుట్టు సేయనేలయ్య
ఱట్టు నాయందెలమోతై యిట్టె వుండఁగాను
(॥ఇవి॥)
పలుమారు నీమేనఁ బచ్చిచూపనేలయ్య
వులివచ్చివలపు నావొళ్ల నుండఁగా
బలిమి శ్రీ వేంకటేశ పై కొని కూడితి నన్ను
నిలువున నెప్పుడు నే నీవురాన నుండఁగా
(||pallavi||)
ivi nīgŏkkanige yā iddarigi sarigāga
tavili movidenĕle taridību seyam̐gā
(||ivi||)
niradi nannŏrasevu nī vemi seduvayya
vŏraḍu nāgubbalalo nuṁḍam̐gānu
yĕrabarigabu guṇā lĕṁcha nībai nelayya
yĕrabarigamu nāgu nivigo kurulanu
(||ivi||)
guṭṭudo nīmām̐ṭalĕllā kŏṁchabarasanelayya
aṭṭĕ nānaḍumu kŏṁchamai vuṁḍam̐gā
ṟaṭṭayinanīsem̐ta guṭṭu seyanelayya
ṟaṭṭu nāyaṁdĕlamodai yiṭṭĕ vuṁḍam̐gānu
(||ivi||)
palumāru nīmenam̐ bachchisūbanelayya
vulivachchivalabu nāvŏḽla nuṁḍam̐gā
balimi śhrī veṁkaḍeśha pai kŏni kūḍidi nannu
niluvuna nĕppuḍu ne nīvurāna nuṁḍam̐gā