ఇవి నమ్మి గర్వించ నేమిటికి
(॥పల్లవి॥)
ఇవి నమ్మి గర్వించ నేమిటికి
వివేకించి కొలిచితే విష్ణుఁడే సతము
(॥ఇవి॥)
కల రిందరుఁ జుట్టాలు కాయముతో నున్నవాళ్లు
వెలయ నంతటిమీఁద వింతవారే
నిలుచును విద్యలెల్లా నేరుపు గలన్నాళ్లు
తలఁపు మఱచితేను తనలోనే యడఁగు
(॥ఇవి॥)
యెక్కుడుగా నుతియింతు రీవి గలయన్నాళ్లు
చక్కఁగా నూరకుండితే చప్ప చప్పనే
గక్కనఁ బంపుసేతురు కలిమి గలన్నాళ్లు
కక్కసానఁ బేదయైతే కొకైన రెవ్వరును
(॥ఇవి॥)
పను లేమైనాఁ జెల్లు బలిమి గలన్నాళ్లు
తన లా వుడిగితేను తడఁబాట్లే
వెనుకొని కొల్చితే శ్రీవేంకటేశుఁడే రక్షించు
మినుకుల భోగములు మీసాలపై తేనెలు
(||pallavi||)
ivi nammi garviṁcha nemiḍigi
vivegiṁchi kŏliside viṣhṇum̐ḍe sadamu
(||ivi||)
kala riṁdarum̐ juṭṭālu kāyamudo nunnavāḽlu
vĕlaya naṁtaḍimīm̐da viṁtavāre
nilusunu vidyalĕllā nerubu galannāḽlu
talam̐pu maṟasidenu tanalone yaḍam̐gu
(||ivi||)
yĕkkuḍugā nudiyiṁtu rīvi galayannāḽlu
sakkam̐gā nūraguṁḍide sappa sappane
gakkanam̐ baṁpuseduru kalimi galannāḽlu
kakkasānam̐ bedayaide kŏgaina rĕvvarunu
(||ivi||)
panu lemainām̐ jĕllu balimi galannāḽlu
tana lā vuḍigidenu taḍam̐bāṭle
vĕnugŏni kŏlside śhrīveṁkaḍeśhum̐ḍe rakṣhiṁchu
minugula bhogamulu mīsālabai tenĕlu