ఇవి గొన్ని నేర్పితివి యీడానాడాఁ దిరిగాడి
(॥పల్లవి॥)
ఇవి గొన్ని నేర్పితివి యీడానాడాఁ దిరిగాడి
తవిలి యొక్కటొక్కటే తలఁపునఁ బారునా
(॥ఇవి॥)
వంతునేల వెట్టేవు వాసులేల రేఁచేవు
పొంతనుండి నీకదేమి పొద్దువోదా
బంతికేల పిలిచేవు బసలేల సేసేవు
కాంతల గన్నప్పుడే కడునెమ్మె వచ్చునా
(॥ఇవి॥)
చేతులేల చాఁచేవు సిగ్గులేల తడవేవు
రాతిరిఁబగలు నీరపమాయనా
ఘాతలేల సేసేవు కన్నులనేల మొక్కేవు
జాతుల నీకాఁడువారు సదరములయిరా
(॥ఇవి॥)
గుబ్బలేల చెనకేవు గురులేల వ్రాసేవు
వుబ్బి మదనకళలు వొళ్లు నిండెనా
నిబ్బరాన శ్రీవేంకటనియల నన్నేలితివి
అబ్బుపుసతులమే యంత నీకుఁ బ్రియము
(||pallavi||)
ivi gŏnni nerbidivi yīḍānāḍām̐ dirigāḍi
tavili yŏkkaḍŏkkaḍe talam̐punam̐ bārunā
(||ivi||)
vaṁtunela vĕṭṭevu vāsulela rem̐sevu
pŏṁtanuṁḍi nīgademi pŏdduvodā
baṁtigela pilisevu basalela sesevu
kāṁtala gannappuḍe kaḍunĕmmĕ vachchunā
(||ivi||)
sedulela sām̐sevu siggulela taḍavevu
rādirim̐bagalu nīrabamāyanā
ghādalela sesevu kannulanela mŏkkevu
jādula nīgām̐ḍuvāru sadaramulayirā
(||ivi||)
gubbalela sĕnagevu gurulela vrāsevu
vubbi madanagaḽalu vŏḽlu niṁḍĕnā
nibbarāna śhrīveṁkaḍaniyala nannelidivi
abbubusadulame yaṁta nīgum̐ briyamu