Ivi gonni nagumbaa tlimka valenaa

ఇవి గొన్ని నగుఁబా ట్లిఁక వలెనా
Language

(॥పల్లవి॥)
ఇవి గొన్ని నగుఁబా ట్లిఁక వలెనా
కవగూడి నీవు నీవే కావా యెపుడు

(॥ఇవి॥)
నించినతట్టుపుణుఁగు నీ వెంత వూసినాను
ముంచినరేపల్లెగొల్లముంజు వొయ్యీనా
పొంచి నీవు మేనఁ గప్పుర మెంత చల్లుకొన్నా
అంచల వెన్నలజిడ్లవి విడిచీనా

(॥ఇవి॥)
కులికి కులికి యెంత కుంకుమ నీ వలఁదిన
యెలమి నలుపే కాక యెఱ్ఱన య్యేవా
చలువఁ బన్నీట నీవు జలక మెంతాడినాను
సొలపుల నీమనసు సుద్దమయ్యీనా

(॥ఇవి॥)
చొక్కపు శ్రీవేంకటేశ సొమ్ములెన్ని నించుకొన్నా
అక్కున నలమేల్మంగ నవి మించీనా
నిక్కపు నీ వేచేఁత నీలోనే చేసినాను
దిక్కులందుఁ గత లయి తిరుగకుండీనా

(||pallavi||)
ivi gŏnni nagum̐bā ṭlim̐ka valĕnā
kavagūḍi nīvu nīve kāvā yĕbuḍu

(||ivi||)
niṁchinadaṭṭubuṇum̐gu nī vĕṁta vūsinānu
muṁchinareballĕgŏllamuṁju vŏyyīnā
pŏṁchi nīvu menam̐ gappura mĕṁta sallugŏnnā
aṁchala vĕnnalajiḍlavi viḍisīnā

(||ivi||)
kuligi kuligi yĕṁta kuṁkuma nī valam̐dina
yĕlami nalube kāga yĕṭrana yyevā
saluvam̐ bannīḍa nīvu jalaga mĕṁtāḍinānu
sŏlabula nīmanasu suddamayyīnā

(||ivi||)
sŏkkabu śhrīveṁkaḍeśha sŏmmulĕnni niṁchugŏnnā
akkuna nalamelmaṁga navi miṁchīnā
nikkabu nī vesem̐ta nīlone sesinānu
dikkulaṁdum̐ gada layi tirugaguṁḍīnā